అతిసారాన్ని నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

త్రాగునీరు, ఆహారం, చేతులు, పాత్రలు లేదా ఆహార తయారీ ఉపరితలాల మీద మలం మరకలు పడినప్పుడు, అతిసారానికి కారణమయ్యే సూక్ష్మక్రిములు పిల్లలు మరియు పెద్దల్లోకి చేరవచ్చు.

కలరా లేదా డయేరియా వ్యాపించడాన్ని పరిమితం చేయడానికి ఈ చర్యలు తీసుకోండి.

  • మలవిసర్జన తర్వాత, మలం తాకిన తర్వాత, ఎల్లప్పుడూ సబ్బు మరియు నీటితో లేదా బూడిద లాంటి ప్రత్యామ్నాయాలతో చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఆహారాన్ని తాకడానికి లేదా సిద్ధం చేయడం లేదా ఆహారం తినడం, పిల్లలకు తినిపించడం లాంటివి చేయాలి. కాబట్టి, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం మరియు సరిగ్గా మరియు తరచుగా చేతులు కడుక్కోవడం పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. మరీముఖ్యంగా, మలవిసర్జన తర్వాత మరియు భోజనం తినడానికి ముందు తప్పక చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • శిశువులు మరియు చిన్న పిల్లల విసర్జితాలతో సహా, అన్ని రకాల మలాన్ని మరుగుదొడ్డి లేదా టాయిలెట్‌లో వేయాలి లేదా పాతిపెట్టాలి. మలం తగిలిన ప్రదేశాలు శుభ్రం చేయాలి.
  • సురక్షితమైన తాగునీరు ఉపయోగించాలి.
  • అన్ని ఆహారాలు కడగండి, తొక్కతీయండి లేదా ఉడికించండి: ముఖ్యంగా చిన్న పిల్లలు పండ్లను పచ్చిగా తింటుంటే, వాటి మీద తొక్క తీయండి లేదా నీటితో వాటిని బాగా కడగండి. తినడానికి ముందు ఆహారాన్ని బాగా ఉడికించండి. విరేచనాలకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నిల్వ ఆహారంలో పెరుగుతాయి. వండిన రెండు గంటల తర్వాత నుండి ఆహార పదార్థాలను చాలా వేడిగా లేదా అత్యంత చల్లగా ఉంచకపోతే, అవి సురక్షితం కాదు. ఈగల వల్ల వ్యాధి వ్యాప్తి చెందడం ఆపడం కోసం నిల్వ ఆహారాలను పూడ్చివేయడం, కాల్చడం లేదా సురక్షితంగా పారవేయడం చేయండి.
  • శిశువుకి మొదటి ఆరు నెలలు ప్రత్యేకించి తల్లిపాలు ఇవ్వడం మరియు ఆరు నెలల తర్వాత తల్లిపాలు ఇవ్వడం కొనసాగించడం వల్ల విరేచనాలకు సంబంధించిన ప్రమాదాలు తగ్గించవచ్చు.
  • రోటావైరస్ కోసం రోగనిరోధకత (సిఫార్సు చేయబడిన మరియు అందుబాటులో ఉన్న చోట) అందించడం వల్ల ఆ వైరస్ వల్ల కలిగే విరేచనాల వల్ల మరణాల ప్రమాదం తగ్గుతుంది.
  • విటమిన్-ఏ మరియు జింక్ సప్లిమెంట్లు విరేచనాల ప్రమాదం తగ్గిస్తాయి. తల్లిపాలు, కాలేయం, చేపలు, పాల ఉత్పత్తులు, నారింజ లేదా పసుపు పండ్లు మరియు కూరగాయలు మరియు ఆకుపచ్చ ఆకుకూరలు లాంటి ఆహారాల్లో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. విరేచనాల చికిత్సలో భాగంగా జింక్ (మాత్రలు లేదా సిరప్)ను 10-14 రోజుల వైద్యంలో చేర్చడం వల్ల విరేచనాల తీవ్రత తగ్గడంలో మరియు నయమయ్యే వ్యవధి తగ్గించడంలో సహాయపడుతుంది మరియు భవిష్యత్తులో విరేచనాల నుండి పిల్లలను రెండు నెలల వరకు రక్షిస్తుంది.
Sources
  • Audiopedia ID: tel020702