అత్యాచారం గురించిన భావాలను అధిగమించడం కోసం నేనేం చేయగలను
మీ శరీరంలో గాయాలు నయమైనప్పటికీ, అత్యాచార ఘటన మిమ్మల్ని చాలాకాలం తర్వాత కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఇక్కడ కొన్ని సాధారణ ప్రతిచర్యలు ఉన్నాయిః
అత్యాచారానికి గురైన స్త్రీ ఎవరితోనైనా మాట్లాడడం లేదా తనకు మంచి అనుభూతి కలిగించే ఏదైనా చేయడం చాలా ముఖ్యం. జరిగిన దాడి గురించి మరచిపోవడానికి స్త్రీ తనదైన మార్గం కనుగొనాలి. కొందరు మహిళల విషయంలో అది ఒక ఆచారం నిర్వహించడం లాంటిది. మరికొందరు విషయంలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించడానికి ప్రయత్నించడం లేదా ఇతర మహిళలు అత్యాచారానికి గురికాకుండా నిరోధించడం కోసం పనిచేయడం చేయాలనుకుంటారు. మీరేం చేసినప్పటికీ, మీ పట్ల మీరు ఓపికతో ఉండండి మరియు ఇతరులను కూడా ఓపిగ్గా ఉండాల్సిందిగా కోరండి. మీరు మంచి అనుభూతి చెందడానికి చాలా సమయం పట్టవచ్చు. అయితే, మీరు విశ్వసించే వారితో మాట్లాడటం, లేదా అత్యాచారం నుండి బయటపడిన వారితో మాట్లాడడం వల్ల మీరు త్వరగా కోలుకోవడంలో మీకు సహాయపడవచ్చు.