అత్యాచారాన్ని నిరోధించేలా వ్యవహరించగల ఒక సరైన లేదా ఒక తప్పు మార్గం ఏదీ లేదు. అయితే, ఒక మహిళ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం ద్వారా, కొన్ని రకాల అత్యాచారాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండవచ్చు. ఒక మహిళ ఏం చేయగలదనే విషయం ఆ పురుషుడికి ఎంత బాగా తెలుసు, ఆమె ఎంతగా భయపడుతోంది మరియు ఆమె ఎంతటి ప్రమాదంలో ఉందని ఆమెకు తెలుసు అనే వాటి మీద ఆమె అత్యాచారానికి గురయ్యే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి: ఒక మహిళ అత్యాచారానికి గురైతే, ఆమె ఆ చర్యను నివారించడంలో విఫలమైనట్టు కాదు. ఆమె కంటే బలమైన వ్యక్తి ఆమె మీద ఆవిధంగా ఒత్తిడి చేయడం వల్లే అది జరిగింది.
క్రింది విధంగా చేయడం ద్వారా, ఒక స్త్రీ అత్యాచారం తప్పించుకోవడంలో సహాయపడవచ్చు:
ఇతర మహిళలతో కలసి పని చేయండి. మీరు సమూహాల్లో పనిచేస్తున్నప్పుడు మీరు సురక్షితంగా మరియు బలంగా ఉంటారు
మిమ్మల్ని భయపెట్టే ఎవరినీ మీ ఇంటికి రానివ్వకండి. మీరు అక్కడ ఒంటరిగా ఉన్నారని అతనికి తెలియనివ్వకండి.
వీలైనంతవరకు ఒంటరిగా వెళ్లకండి. ప్రత్యేకించి, రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకండి. మీరు ఒంటరిగా వెళ్లాల్సి వస్తే, మీ తల పైకెత్తి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా వ్యవహరించండి. చాలా మంది రేపిస్టులు దాడి చేయడానికి సులభంగా ఉండే మహిళ కోసం వెతుకుతుంటారు.
మిమ్మల్ని ఎవరైనా అనుసరిస్తున్నారనుకుంటే, వేరొక దిశలో నడవడానికి ప్రయత్నించండి లేదా వేరొక వ్యక్తి, ఇల్లు లేదా దుకాణం వైపు వెళ్ళండి లేదా అతడి వైపు తిరిగి, నీకేం కావాలి అని చాలా బిగ్గరగా అడగండి.
ఊదితే పెద్దగా శబ్దం వచ్చే ఒక విజిల్ లాంటిది మీతో తీసుకెళ్లండి. అలాగే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఉపయోగించగల దేనినైనా తీసుకెళ్లండి. అది ఒక కర్ర కావచ్చు, అతని కళ్ళలో చల్లగలిగినది కావచ్చు లేదా అతని కళ్ళలో చల్లడానికి ఘాటైన మసాలా పొడి-ఘాటైన మిరియాలు లేదా మిరపకాయ పొడి కూడా కావచ్చు.
మీపై దాడి జరిగితే, మీకు వీలైనంత బిగ్గరగా కేకలు వేయండి లేదా మీ విజిల్ ఊదండి. అది పని చేయకపోతే, అతడికి బాధ కలిగే రీతిలో కొట్టండి. తద్వారా, మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది.