అసురక్షిత గర్భస్రావం వల్ల మరణం సంభవించకుండా ఎలా నిరోధించవచ్చు
విధిలేని పరిస్థితుల్లో మాత్రమే మహిళలు గర్భం తొలగించుకునే మార్గాలు అన్వేషిస్తారు. క్రింది పద్ధతులకు దూరంగా ఉండండి. ఇవి చాలా ప్రమాదకరమైనవి:
యోని మరియు గర్భాశయంలోకి కర్రలు, తీగ లేదా ప్లాస్టిక్ గొట్టాలు లాంటి పదునైన వస్తువులు చొప్పించకండి. ఇవి గర్భాశయాన్ని చీల్చి వేయడం ద్వారా ప్రమాదకర రక్తస్రావం మరియు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.
యెని లేదా గర్భాశయంలోకి మూలికలు లేదా మొక్కలు చొప్పించకండి. ఇలా చేయడం వల్ల లోపలి అవయవాలు తీవ్రంగా కాలిపోవచ్చు లేదా చికాకు కలిగించవచ్చు. అవయవాలకు నష్టం, ఇన్ఫెక్షన్ మరియు రక్తస్రావం జరగవచ్చు.
యోని లేదా గర్భాశయంలోకి బ్లీచ్, లై, బూడిద, సబ్బు లేదా కిరోసిన్ లాంటి పదార్థాలు చొప్పించడం లేదా వాటిని తాగడం చేయకండి.
గర్భస్రావానికి కారణమయ్యే ఔషధాలు లేదా సాంప్రదాయ మూలికలను పెద్ద మొత్తంలో తీసుకోవడం (నోటి ద్వారా తీసుకోవడం లేదా యోనిలోకి చొప్పించడం) చేయకండి. ఉదాహరణకు, మలేరియా కోసం ఔషధాలు (క్లోరోక్విన్) ఎక్కువగా తీసుకోవడం లేదా ప్రసవం తర్వాత రక్తస్రావం ఆపడం కోసం తీసుకునే (ఎర్గోమెట్రిన్, ఆక్సిటోసిన్) ఔషధాల వల్ల గర్భస్రావం కంటే ముందు మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
మీ పొత్తి కడుపు మీద కొట్టుకోవడం లేదా మీకు మీరే మెట్ల మీద నుండి క్రిందకు పడిపోవడం చేయకండి. దానివల్ల మీ శరీరం లోపల గాయాలు మరియు రక్తస్రావం జరగవచ్చు. అదేసమయంలో, మీకు గర్భస్రావం జరగకపోవచ్చు.
గుర్తుంచుకోండి: మీకు మీరే లేదా శిక్షణ వ్యక్తి ద్వారా గర్భాశయంలోకి ఏదైనా చొప్పించే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీరు చనిపోయే ప్రమాదం ఉంది.
అసురక్షిత గర్భస్రావం జోలికి వెళ్లకండి. దానికి బదులుగా, అవాంఛిత గర్భం రాకుండా నిరోధించే ప్రయత్నం చేయండి.