ఆందోళనను 'వ్యాక్యులత', 'వ్యాక్యులత దాడులు' మరియు 'గుండె భారం' లాంటి ఇతర పేర్లతోనూ పేర్కొంటారు.
ప్రతిఒక్కరూ ఏదోఒక సమయంలో ఆందోళన లేదా వ్యాక్యులతకు గురవుతారు. అయితే, ఈ భావాలు ఒక నిర్దిష్ట పరిస్థితి వల్ల సంభవించినప్పుడు, సాధారణంగా అవి వెంటనే వెళ్లిపోతాయి. అయితే, ఆ ఆందోళన అలాగే కొనసాగితే లేదా మరింత తీవ్రంగా మారితే లేదా ఎటువంటి కారణం లేకుండానే ఆందోళన కలుగుతుంటే, దానికి మానసిక ఆరోగ్య సమస్య కారణం కావచ్చు.
సంకేతాలు:
కారణమేదీ లేకుండానే ఉద్రిక్తంగా మరియు ఆందోళనగా ఉండడం
చేతులు వణకడం
చెమట పట్టడం
గుండెపోటు అనుభూతి (గుండె జబ్బు లేనప్పటికీ)
స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బంది
శారీరక అనారోగ్యం లేనప్పటికీ, తరచుగా శారీరక అనారోగ్య సంకేతాలు మరియు ఒక మహిళ కలత చెందినప్పుడు పెరిగే భయాందోళన కారణంగా, ఆమెలో ఆందోళన దాడులు సంభవిస్తాయి. ఇవి అకస్మాత్తుగా సంభవిస్తాయి మరియు అనేక నిమిషాల నుండి అనేక గంటల వరకు ఉంటాయి. పైన పేర్కొన్న సంకేతాలతో పాటు, ఒక వ్యక్తి భయం లేదా భయంకర అనుభవాన్ని అనుభవిస్తారు మరియు ఆమె స్పృహ కోల్పోవచ్చు (మూర్ఛపోవచ్చు) లేదా చనిపోతానని భయపడవచ్చు. ఆమెకు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఏదో భయంకరమైనది జరగబోతున్నట్టుగా కూడా అనిపించవచ్చు.