ఆత్మహత్య గురించి నేను ఏం తెలుసుకోవాలి

From Audiopedia
Jump to: navigation, search

ఒక వ్యక్తి తాను ఇకపై జీవించాలనుకోనప్పుడు ఉద్దేశపూర్వకంగా తన జీవితాన్ని ముగించుకునే చర్యనే ఆత్మహత్య అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1 మిలియన్ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని అంచనా. అంటే, ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ సంఖ్యలతో పాటు, ప్రతి సంవత్సరం కనీసం 20 మిలియన్ల మంది ఆత్మహత్య ప్రయత్నాలు విఫలమవుతున్నాయి - అలాగే, ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.

ఆత్మహత్యలకు సంబంధించి విశ్వసనీయ సంఖ్యలు కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే, పోలీసుల వేధింపుల భయంతో మరియు/లేదా సామాజిక కళంకం భయంతో చాలా కుటుంబాలు అత్మహత్య గురించిన వాస్తవాన్ని బహిర్గతం చేయవు.

మొదటి ప్రపంచ దేశాల్లో చాలావరకు ఆత్మహత్యల రేట్లు తగ్గుతున్నప్పటికీ, తక్కువ సంపన్న దేశాల్లో వీటి సంఖ్య భయానకంగా పెరుగుతోంది.

ఈ ఆందోళనకర సంఖ్యలకు క్రింది అంశాలు కారణాలు ఉండగలవు:

  • పేదరికం
  • నాసిరకం విద్య (తద్వారా, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం)
  • వేగవంతమైన పారిశ్రామికీకరణ (శారీరక కష్టంతో చేసే అనేక ఉద్యోగాలు పోవడానికి దారితీస్తుంది)
  • పేలవమైన ఆరోగ్య సేవలు (మానసిక ఆరోగ్య నిపుణుల లభ్యత మరియు నిరాశ లేదా ఆందోళన లాంటి సమస్యలకు చికిత్సలు చాలా పరిమితంగా ఉంటాయి)
  • సంప్రదాయాలు మరియు అవగాహన లేకపోవడం (దేశంలోని లేదా సమాజంలోని సంప్రదాయాలు విధించే పరిమితులు కారణంగా, ప్రజలు తమకు నచ్చినట్టుగా ఉండలేకపోవడం)
Sources
  • Audiopedia ID: tel020901