ఆత్మహత్య తర్వాత అత్యంత సాధారణ ప్రతిచర్యలు ఎలా ఉంటాయి
ఆత్మహత్య కారణంగా, ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం చాలా కష్టమైన విషయం. ఆత్మహత్య కారణంగా, మీరు ఎవరినైనా కోల్పోతే, మీకు ఆ నొప్పి మరియు గందరగోళం తీవ్రంగా ఉండవచ్చు. స్నేహితుడు లేదా బంధువు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వ్యక్తమయ్యే ఇతర సాధారణ ప్రతిచర్యలు:
మొదట, చాలామంది జరిగిన దానిని అస్సలు అంగీకరించలేరు. తాము ఎంతగానో ఇష్టపడే వ్యక్తి తన జీవితాన్నే అంతం చేసుకునేంత అసంతృప్తితో ఉన్నారంటే వాళ్లు నమ్మలేరు. దాంతో, ఆ వ్యక్తి మరణానికి (ప్రమాదం, హత్య, అనారోగ్యం మొదలైనవి) ఇతర కారణాల కోసం వెతికే ప్రయత్నం చేస్తారు. అతను లేదా ఆమె మరణానికి సంబంధించిన నోటీసు సైతం అవాస్తవమని వాళ్లు పేర్కొనవచ్చు. వాళ్ల దుఃఖంలో అదొక సాధారణ భాగం. కోపం: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పట్ల మీకు తీవ్రమైన కోపం రావచ్చు. అతను/ఆమె అలా ఎలా చేయగలిగారని మీరు అనుకోవచ్చు. మేము కలిసి ఆనందించిన క్షణాలన్నీ అతను/ఆమె తనతో తీసుకెళ్లి పోయారు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. అతను/ఆమె చేసిన పని స్వార్థపూరితమైనది! 'అలాంటి ఒక దుఃఖానికి గురైన వారిలో ఈ రకమైన ఆలోచనలు సాధారణమైనవి మరియు ప్రామాణికమైనవి. నొప్పి మరియు బాధన భరించేలా మిమ్మల్ని వదిలి, అతను/ఆమె జీవితం అంతం చేసుకోవడానికి అతను/ఆమె తీసుకున్న ఎంపిక పట్ల కోపగించుకునే హక్కు మీకు ఉంది.