ఆరోగ్య సమస్యలను నేను ఏవిధంగా నిరోధించగలను
మెరుగైన పోషకాహారం, పరిశుభ్రత, విశ్రాంతి మరియు మహిళల ప్రాథమిక ఆరోగ్య అవసరాలు తీర్చడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు నిరోధించవచ్చు.
ఆరోగ్యంతో నిండిన సమాజాలనేవి మహిళలు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడతాయి. ఆరోగ్యవంతులైన మహిళలు వారి కుటుంబాలను సంరక్షించుకోగలరు. ఆరోగ్యకరమైన కుటుంబాలు సమాజానికి మరింత దోహదం చేయగలవు.
అనారోగ్యాన్ని నిరోధించడం మహిళలకు ఎల్లప్పుడూ సులభం కాదు. తమ కుటుంబాలను మరియు సమాజాలను ఆరోగ్యంగా ఉంచడం కోసం మహిళలు చాలా కష్టపడినప్పటికీ, చాలామంది మహిళలు తమ సొంత ఆరోగ్య అవసరాలపై శ్రద్ధ వహించడానికి సమయం, శక్తి మరియు డబ్బు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఇతరుల అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా మహిళలకు తరచుగా చెబుతుంటారు కాబట్టి, వాళ్లు తమ కుటుంబాల సంరక్షణ చూసుకున్న తర్వాత, వాళ్లకి తమ కోసం తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. అలాగే, కుటుంబంలో వనరులు పరిమితంగానే ఉండే కారణంగా, తరచుగా పిల్లలు మరియు పురుషుల కోసమే మొదటగా ఖర్చు చేస్తుంటారు.
తద్వారా, భవిష్యత్తులో, వారికి ఏవైనా వ్యాధులు వచ్చి, వాటికి చికిత్స అందించడానికి బదులుగా, ముందుగానే ఆ ఆరోగ్య సమస్యలను నిరోధించడం వల్ల, బోలెడంత బాధ మరియు ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి నుండి తప్పించుకోవచ్చు. వీటిలో కొన్ని విషయాల కోసం ఎక్కువ సమయం లేదా డబ్బు అవసరం ఉండదు. మిగిలిన వాటి విషయంలో, కనీసం ప్రారంభంలోనైనా, కొంత అదనపు సమయం, ప్రయత్నం మరియు డబ్బు అవసరమవుతుంది. అయితే, మహిళల్లో ఆరోగ్య సమస్యలు రాకముందే, వాటిని నిరోధించడం వల్ల, ఆమె కుటుంబంతో పాటు ఆమె సమాజం కూడా ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటుంది కాబట్టి, భవిష్యత్తు జీవితం సులభంగా మరియు మెరుగ్గా ఉంటుంది.