ఆహారంలోకి సూక్ష్మక్రిముల వ్యాప్తిని నేనెలా నిరోధించగలను

From Audiopedia
Jump to: navigation, search

  • ఆహారం తయారుచేసే ముందు, తినే ముందు మరియు మీ పిల్లలకు తినిపించే ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోండి. చేతులు కడుక్కోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. మీ చేతులు తుడుచుకోవడానికి శుభ్రమైన ప్రత్యేక వస్త్రం ఉపయోగించండి. ఆ వస్త్రాన్ని తరచుగా ఉతికి, ఎండలో ఆరబెట్టండి లేదా మీ చేతుల్లో నీళ్లు క్రిందికి జారిపోయేలా మీ చేతులు ఊపుతూ, ఆరనివ్వండి.
  • పచ్చిగానే తినే పండ్లు మరియు కూరగాయలన్నింటినీ కడిగి లేదా తొక్క తీసి తినండి.
  • మాంసం, పౌల్ట్రీ లేదా చేపలు లాంటివి పచ్చిగా తినే ఆహారాలకు తగలకుండా చూసుకోండి. ఈ మాంసాలు ముక్కలు చేసిన తర్వాత ఎల్లప్పుడూ మీ చేతులు, కత్తి మరియు కట్టింగ్ బోర్డ్‌ని కడిగి శుభ్రం చేయండి.
  • ఆహారానికి దగ్గర్లో దగ్గడం, ఉమ్మడం మరియు ఆహారం దగ్గర ఉన్నప్పుడు గమ్ లేదా పాన్ లాంటివి నమలకండి. తద్వారా, మీ లాలాజలం ఆహారం మీద పడదు.
  • వంటకాలు లేదా శుభ్రం చేసిన పాత్రలను జంతువులు నాకకుండా చూసుకోండి. వీలైతే, జంతువులను వంటగదికి దూరంగా ఉంచండి.
  • ఆహారం పాడైనప్పుడు దూరంగా పారేయండి.
Sources
  • Audiopedia ID: tel010118