ఆహారంలో తగినంత అయోడిన్ ఉండేలా నేనెలా నిర్ధాంచుకోగలను
గాయిటర్‌గా పిలిచే గొంతు వాపు మరియు ఇతర సమస్యలు నివారించడంలో అయోడిన్ సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఒక మహిళకు తగినంత అయోడిన్ లభించకపోతే, ఆమె బిడ్డలో మానసిక ఎదుగుదల నెమ్మదించవచ్చు. మట్టి, నీరు లేదా ఆహారంలో సహజమైన అయోడిన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో గాయిటర్ మరియు మానసిక మందం సర్వసాధారణం.
సాధారణ ఉప్పుకు బదులుగా అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించడమనేది తగినంత అయోడిన్ పొందడానికి సులభమైన మార్గం.
లేదా క్రింది ఆహారాలు (తాజాగా లేదా ఎండబెట్టి) కూడా తినవచ్చు:
అయోడైజ్డ్ ఉప్పు లేదా ఈ ఆహారాలు దొరకడం కష్టంగా ఉంటే లేదా మీ ప్రాంతంలో గాయిటర్ లేదా మానసిక మందం ఉంటే, నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ ద్వారా అయోడైజ్డ్ నూనె తీసుకోవడం గురించి తెలుసుకోవడానికి స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించండి. లేకపోతే, పాలీవిడోన్ అయోడిన్ (తరచుగా స్థానిక ఫార్మసీలో లభించే క్రిమినాశకం) తో మీరే ఇంట్లో అయోడిన్ ద్రావణం తయారు చేయకోవచ్చు.