ఆహారాన్ని నేనెలా చల్లగా ఉంచగలను

From Audiopedia
Jump to: navigation, search

కుండతో సిద్ధం చేసిన కూలర్ ఒక పెద్ద కుండలో మరొక చిన్న కుండ ఉంచడం ద్వారా ఈ రెండు-కుండల కూలర్ తయారు చేస్తారు. కుండల మధ్య ఖాళీ భాగాన్ని నీటితో నింపుతారు. మెరుపు లేని (గట్టిగా, నున్నగా ఉండేలా కవర్ చేయబడి ఉండాలి) ఒక పెద్ద కుండను మూతతో పాటు ఉపయోగించడం ద్వారా, ఆ కుండ గుండా నీళ్లు ఆవిరవుతాయి. చిన్న కుండ లోపలి భాగం తళతళలాడేలా ఉండడం వల్ల దానిని శుభ్రం చేయడం సులభంగా ఉండడంతో పాటు పెద్ద కుండలోని నీళ్లు ఆహారంలోకి చేరకుండా ఉంటుంది. \\కబోర్డ్ కూలర్ ఒక చెక్క క్రేట్ లేదా పెట్టెని ఒకవైపు గోడకు ఆనించి, నేల నుండి పైకి దానిచుట్టూ ఇటుకలు లేదా రాళ్లతో కట్టడం కట్టండి. పెట్టె పైన ఒక నీటి కంటైనర్ ఉంచండి మరియు ఆ కంటైనర్ మీదుగా ఒక ముతక వస్త్రం చుట్టండి. తర్వాత, మొత్తం డబ్బాను వస్త్రంతో కప్పేయండి. ఆ వస్త్రం నేలకు తగలకుండా ఉండాలి. వస్త్రాన్ని నీటితో తడపండి. వస్త్రం మొత్తం తేమ వచ్చే వరకు అలా చేయండి. ఇప్పుడు ఆహారాన్ని పెట్టె లోపల ఉంచండి. వస్త్రంలోని నీరు ఆవిరైనప్పుడు, లోపల ఉండే ఆహారం చల్లబడుతుంది. వస్త్రం ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూడగలిగితే, ఈ పద్ధతి ఉత్తమంగా పనిచేస్తుంది.

Sources
  • Audiopedia ID: tel010123