ఆహారాన్ని వండే సరైన పద్ధతి ఏది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

  • ఆహారాన్ని వండడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. మాంసం, చేపలు, పౌల్ట్రీ లాంటి మాంసాహారాలను చక్కగా ఉడకబెట్టాలి. ఏదీ పచ్చిగా కనిపించకూడదు లేదా పచ్చి మాంసం రంగులో ఉండకూడదు.
  • ఆహారం చల్లబడడం మొదలుకాగానే, సూక్ష్మక్రిములు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. వండిన ఆహారం 2 గంటల లోపు తినలేకపోతే, ఆ ఆహారాన్ని మళ్లీ బాగా వేడి చేయండి. ద్రవ పదార్థాలను బుడగలు వచ్చే వరకు వేడి చేయాలి మరియు ఘన పదార్థాలు (బియ్యం లాంటివి) ఆవిరి వచ్చే వరకు ఉడికించాలి.
  • కొన్ని సమాజాల్లో ముడి మాంసం లేదా చేపలు వండడానికి సంప్రదాయ పద్ధతులు ఉంటాయి. తద్వారా, అవి తినడానికి సురక్షితంగా ఉంటాయి.
Sources
  • Audiopedia ID: tel010120