ఇంటి నుండి దూరంగా పనిచేయడం నా ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది
చాలామంది మహిళలు వాళ్ల ఇంటి నుండి దూరంగా పని చేస్తుంటారు. కొంతమంది మహిళలు ప్రతిరోజూ ఇంటి నుండి పనికి వెళతారు. మరికొందరు పని ప్రదేశానికి దగ్గరగా ఉండడం కోసం చాలా మైళ్ళ దూరం వెళ్తారు. దీనినే 'వలస' అని పిలుస్తారు.
చాలా తరచుగా, మహిళలు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద కర్మాగారాల్లో ఉద్యోగాలు కోసం నగరాలకు లేదా గృహ కార్మికులుగా ఉపాధి లభించే నగరాలకు వెళ్తుంటారు. కొందరు మహిళలు పని ప్రదేశానికి వెళ్లడానికి అంగీకరించినప్పటికీ, కొందర్ని పని పేరుతో బలవంతంగా తరలిస్తుంటారు. ఇంట్లో తిండికి కూడా లేకపోవడం, కర్మాగారాల్లో పనిచేస్తే ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశ అందుకు కారణంగా ఉంటుంది. తరచుగా ఈ మహిళల సంపాదన వారి కుటుంబాలను ఆదుకోవడంలో చాలా కీలకంగా ఉంటుంది.
మహిళలు వలస వెళ్ళినప్పుడు, వాళ్లు మొదటిసారిగా ఒంటరితనానికి గురికావచ్చు. తమకు మద్దతు ఇచ్చే కుటుంబం మరియు స్నేహితులకు దూరంగా ఉండడం వల్ల చాలా భయపడవచ్చు.