ఇంటి నుండి దూరంగా పని చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను
From Audiopedia - Accessible Learning for All
పని ప్రదేశంలోని ఇతర మహిళలతో స్నేహం చేయండి. ఆ మహిళలు మీకు కొత్త మద్దతుదారులు కావచ్చు.
నివాసం కోసం సురక్షితమైన స్థలం కనుగొనండి. చాలా కంపెనీలు తమ సొంత వసతి గృహాలు నడుపుతుంటాయి. కొన్ని సురక్షితంగా ఉంటాయి. కానీ, అన్నీ అలా ఉండవు. కొన్నిసార్లు అవి మహిళలు అధ్వాన్న ప్రదేశాల్లో జీవించాల్సి రావచ్చు. కానీ, ఆమాత్రం నివాసం కోసం భారీగా చెల్లించాల్సి రావచ్చు. ఈ మహిళలకు వారి నివాస ప్రదేశం మీద అధికారం ఉండదు కాబట్టి, కంపెనీ కూడా ఆ పరిస్థితిని దుర్వినియోగం చేయవచ్చు.
రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికి వెళ్లడం లాంటి ప్రమాదకర పరిస్థితులు నివారించండి.
ప్రతి ఒక్కరికీ మొదట్లో ఒంటరితనం తప్పదని, అది సహజమేనని గుర్తుంచుకోండి.