మీకు క్రింది పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు పిల్స్ తీసుకోవడం ఆపేసి, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి:
మీరు పిల్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, మీకు తీవ్రమైన తలనొప్పితో పాటు చూపు అస్పష్టంగా (మైగ్రేన్) ఉంటే.
మీ చేతులు లేదా కాళ్లలో బలహీనంగా లేదా తిమ్మిరిగా అనిపిస్తుంటే.
మీ ఛాతీలో తీవ్రమైన నొప్పితో పాటు శ్వాస ఆడని పరిస్థితి ఉంటే.
ఒకే కాలిలో తీవ్రమైన నొప్పి ఉంటే
పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఉంటే.
మీకు ఇలాంటి సమస్యలు ఉంటే, మీరు గర్భం ధరించడం కూడా మీకు ప్రమాదకరం కాగలదు. కాబట్టి, హార్మోన్ల కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను కలసి విషయం నిర్ధారించుకునే వరకు మీరు కండోమ్ లాంటి వేరొక కుటుంబ నియంత్రణ ఉపయోగించాలి.