ఏదైనా వ్యాధి మహమ్మారిగా మారినప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా రక్షించగలను

From Audiopedia
Jump to: navigation, search

అత్యవసర పరిస్థితుల్లో, సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత లేకపోవడం వల్ల ఏదైనా వ్యాధి మహమ్మారిగా మారే అవకాశం ఉంటుంది. పేలవమైన పారిశుద్ధ్యం మరియు రద్దీ ఉన్న చోట కలరా విజృంభించవచ్చు.

వ్యాధి తీవ్రత (లేదా వ్యాప్తి) పట్ల ప్రతిస్పందన మీద ఆధారపడి ఒక వ్యాధి అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది. ఇన్‌ఫ్లూయెంజా లాంటి మహమ్మారి మరియు సన్నిహిత వ్యక్తిగత సంపర్కం ద్వారా వ్యాపించే ఇతర వ్యాధుల విషయంలో, అనారోగ్యంతో ఉన్నవారిని ఇతరుల నుండి దూరంగా ఉంచాలి.

అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, వాంతులు మరియు విరేచనాలు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, న్యుమోనియా మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు కూడా ఇన్‌ఫ్లూయెంజా దారితీస్తుంది.

అనుసరించాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు:

  • సబ్బు మరియు నీరు లేదా బూడిద మరియు నీళ్లు లాంటి ప్రత్యామ్నాయాలతో తరచుగా చేతులు కడుక్కోవాలి
  • మలం మరియు చెత్తను సురక్షితంగా పారవేయాలి
  • సురక్షితమైన ఆహార తయారీ అభ్యసించాలి
  • సురక్షితమైన నీటి వనరులు ఉపయోగించండి లేదా ఉడకబెట్టడం, వడపోత, క్లోరిన్ జోడించడం లేదా సూర్యరశ్మితో క్రిమిసంహారకం లాంటి ఇంటి ఆధారిత నీటి చికిత్స ఉపయోగించాలి
  • శుభ్రమైన, మూతవేసిన కంటైనర్లలోనే సురక్షితమైన నీటిని నిల్వ చేయాలి
  • అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలి, ఇతరులకు దూరంగా ఉండాలి
  • లక్షణాలు మరియు ప్రమాద సంకేతాలు గురించి, అనారోగ్యం తీవ్రంగా మారితే సహాయం పొందడానికి ఏం చేయాలో మరియు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవాలి
  • దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మోచేయి లేదా టిష్యూ అడ్డుగా పెట్టుకోవాలి. ఆ టిష్యూలను సురక్షితంగా పారవేయాలి
Sources
  • Audiopedia ID: tel020706