ఏవిధమైన భావనల కారణంగా మహిళల మీద పురుషులు హింసకు పాల్పడుతున్నారు
ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని తప్పుడు ఆలోచనలు ఈవిధంగా ఉన్నాయి:
అతను మద్యం సేవించడం వల్లే అలా జరుగుతుంది... నిజానికి: మద్యం అనేది హింసకు దారితీయదు కానీ, తరచుగా పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అయితే, ప్రజలు మద్యం తాగని ప్రదేశాల్లోనూ ఇలాంటి హింస సర్వసాధారణం.
ఆమె మీద అతనికి అంత ప్రేమ ఉంది కాబట్టే, అతను ఆమెని అలా కొట్టేశాడు. నిజానికి: కొట్టడమనేది ప్రేమకు సంకేతం కాదు. గౌరవం మరియు దయ చూపించడమే నిజమైన ప్రేమ.
అది భార్యాభర్తల వ్యవహారం. అందులో ఇతరులు జోక్యం చేసుకోవడం సరికాదు. నిజానికి: హింస అనేది ఏమాత్రమూ కుటుంబ విషయం కాదు. ఎందుకంటే, అలాంటి హింస కారణంగా, చాలామంది మహిళలు గాయపడతున్నారు లేదా హత్యకి గురవుతున్నారు. హింస అనేది ఒక సాంఘిక మరియు సామాజిక ఆరోగ్య సమస్యగా ఉంటోంది.
పేదలు మరియు అజ్ఞానులైన పురుషులే భార్యలను కొడతారు. నిజానికి: హింస అనేది పేదరికం లేదా అజ్ఞానంతో ముడిపడిన సమస్య కాదు. ధనికులు లేదా పేదలు, విద్యావంతులు లేదా నిరక్ష్యరాస్యులు, నగరం లేదా గ్రామంలో ఎక్కడైనా అలాంటి హింస జరగవచ్చు.
పిల్లల కోసమైనా ఆమె అతనితో ఉండాలి. ఎందుకంటే, తండ్రిగా అతను మంచివాడే. నిజానికి: హింసా ప్రవృతి కలిగిన పురుషుడితో స్త్రీ కలిసి ఉండడం ఆ కుటుంబానికి ఎప్పుడూ మంచిది కాదు. తమ భావాల విషయంలో తప్పుడు మార్గాల్లో వెళ్లడం, మహిళల పట్ల ఎలా క్రూరంగా ప్రవర్తించాలో అతను తన పిల్లలకు కూడా నేర్పుతాడు. ఒక పురుషుడు భార్యని కొట్టినా సరే, పిల్లల్ని కొట్టినా సరే, అతను తన పిల్లలకి సరైన ఎంపిక కాదు.