ఏవైనా హార్మోనల్ పద్ధతులకు మహిళలు దూరంగా ఉండాలా

From Audiopedia
Jump to: navigation, search

రొమ్ము క్యాన్సర్ లేదా రొమ్ములో గట్టి ముద్దలు ఉన్న మహిళలు హార్మోన్ల పద్ధతికి దూరంగా ఉండాలి. హార్మోన్ల పద్ధతులు క్యాన్సర్‌కి కారణం కావు. కానీ, ఒక మహిళకు అప్పటికే రొమ్ము క్యాన్సర్ ఉంటే, ఈ పద్ధతుల వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు.

గర్భం ధరించిన లేదా నెలసరి రక్తస్రావం ఆలస్యమైన మహిళలు.

హార్మోన్ల పద్ధతులు ప్రారంభించడానికి నెలల ముందు నుండి యోనిలో అసాధారణ రక్తస్రావం ఉన్న మహిళలు వాళ్లకి ఏదైనా తీవ్ర సమస్య ఉందా అని తెలుసుకోవడం కోసం ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లాలి.

ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు కొన్ని హార్మోన్ల పద్ధతులు హానికరం కాగలవు. ప్రతి పద్ధతి మీకు సురక్షితమైనదేనా అని తెలుసుకోవడం కోసం దానిని తప్పకుండా తనిఖీ చేయాలి. పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏవైనా మీకు ఉన్నప్పటికీ, మీరు ఏదైనా ఒక పద్ధతి ఉపయోగించాలనుకుంటే, కుటుంబ నియంత్రణ కోసం హార్మోన్ల పద్ధతుల మీద శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి.

మూర్ఛ (\"ఫిట్స్\"), క్షయ (టిబి) లేదా HIV కోసం ఉపయోగించే కొన్ని ఔషధాల వల్ల హార్మోన్ల పద్ధతులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి, ఈ మందులు తీసుకునే స్త్రీ వేరొక కుటుంబ నియంత్రణ పద్ధతిని ఉపయోగించాలి లేదా కండోమ్ లేదా డయాఫ్రాగమ్ లాంటి రెండవ పద్ధతితో కలిపి ఉపయోగించాలి.

Sources
  • Audiopedia ID: tel020418