కుటుంబ నియంత్రణ ఉపయోగించాలని మీరు నిర్ణయించుకుంటే, మీరు తప్పనిసరిగా ఒక పద్ధతి ఎంచుకోవాలి. ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంలో ముందుగా మీరు వివిధ పద్ధతులు మరియు వాటి ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు గురించి తెలుసుకోవాలి.
కుటుంబ నియంత్రణ కోసం ప్రధానంగా 5 రకాల పద్ధతులు ఉన్నాయి:
అడ్డంకి పద్ధతులు - అండంతో వీర్యం కలవడాన్ని ఇవి నిరోధిస్తాయి.
హార్మోనల్ పద్ధతులు - స్త్రీ అండాశయం నుండి అండం విడుదల కావడాన్ని ఇవి నిరోధిస్తాయి. కాబట్టి, అండంతో వీర్యం కలవడం కష్టతరమవుతుంది. మరియు గర్భాశయం గోడల్లో గర్భం పెరిగే అవకాశాన్ని అడ్డుకుంటాయి.
IUDలు - స్త్రీలోని అండాన్ని చేరి, దాన్ని ఫలదీకరణం చేయనుండి పురుషుడి వీర్యాన్ని ఇవి నిరోధిస్తాయి.
సహజ పద్ధతులు - తానెప్పుడు ఫలవంతంగా ఉంటుందో తెలుసుకోవడంలో ఇవి స్త్రీకి సహాయపడుతాయి. తద్వారా, ఆ సమయంలో ఆమె లైంగిక చర్యకు దూరంగా ఉండగలుగుతుంది
శాశ్వత పద్ధతులు - పురుషుడు లేదా స్త్రీకి ఇకపై పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసే ఆపరేషన్లు ఇలాంటివే.