ఏ స్త్రీలు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఎక్కువ
From Audiopedia
చాలా జంటల విషయంలో, స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పురుషుడు మొదటిసారిగా మరింత హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటాడు. ఆమె శరీరంలోని మార్పులను తాను నియంత్రించలేని కారణంగా, తాను ఆమె మీద నియంత్రణ కోల్పోతున్నట్లు అతనికి అనిపించవచ్చు. ఆమె శిశువు మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ, తన పట్ల తక్కువ శ్రద్ధ చూపుతున్నందుకు లేదా ఆమె అతనితో ఉండడానికి ఇష్టం చూపక పోవడం వల్ల అతనికి కోపం రావచ్చు. అలాగే, చాలామంది జంటలు కొత్తగా బిడ్డకి జన్మనివ్వాలనుకుంటున్నప్పుడు డబ్బు గురించి మరింత ఆందోళన చెందుతుంటారు.
వికలాంగ మహిళలు కూడా ఎక్కువ వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది: తమకు 'పరిపూర్ణ' మహిళ లభించలేదని కొంతమంది పురుషులు కోపంతో ఉండవచ్చు. అంగవైకల్యం ఉన్న స్త్రీ తనను తాను రక్షించుకోలేకపోవచ్చు కాబట్టి, ఆమెని నియంత్రించడం సులభమని పురుషులు భావించవచ్చు.