ఏ హానికర నమ్మకాలనేవి కుటుంబ సంఘర్షణలకు కారణమవుతాయి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

దురదృష్టవశాత్తూ, అనేక దేశాల్లో, లింగ అసమానతతో పాటు పురుషులు మరియు మహిళల మధ్య అధికార సంబంధాల్లో అసమానత ఇప్పటికీ ఉంటోంది. హానికర తప్పుడు నమ్మకాలతో ఈ అసమానత తరచుగా మరింతగా పాతుకుపోయింది. అలాంటి కొన్ని నమ్మకాలు ఏవంటే:

  • మహిళల కంటే పురుషులే గొప్పవారు.
  • మహిళలు పనికిమాలిన వాళ్లు మరియు వారి కుటుంబాలకు వాళ్లు పెనుభారం లాంటివాళ్లు.
  • మహిళల మీద పురుషులకు యాజమాన్య హక్కులు ఉన్నాయి.
  • కుటుంబ నేపధ్యంలో మూసిన తలుపుల వెనుక ఏం జరిగినా అది వారి వ్యక్తిగత విషయం.

అనేక కుటుంబాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ విలువ ఇస్తారు. ఎందుకంటే, అబ్బాయిలు కుటుంబ సంపదకు ఎక్కువ దోహదం చేయగలరు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించగలరు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత కర్మకాండలు చేస్తారు మరియు కుటుంబం పేరు కొనసాగిస్తారు లాంటి విశ్వాసాల ఫలితంగా, అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిలకు తరచుగా తక్కువ కాలమే తల్లిపాలు ఇస్తారు, ఆహారం మరియు వైద్య సంరక్షణ తగినంత అందించరు, విద్యావకాశాలు తక్కువగా అందిస్తారు లేదా అస్సలు అందించరు.

అనేక సమాజాల్లో, మహిళకు ఆస్తి ఉండదు లేదా వారసత్వంగా ఆస్తి అందుకోలేరు. వాళ్లు డబ్బు సంపాదించలేరు లేదా అప్పు పొందలేరు. మహిళ విడాకులు తీసుకుంటే, ఆమెకు తన సంతానం లేదా తన వస్తువులు తనవద్దే ఉంచుకునేందుకు అనుమతి ఉండదు. ఒక మహిళకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ, ఆమె సమాజంలోని సంప్రదాయాలనేవి జీవితం మీద ఆమెకు తక్కువ నియంత్రణ మాత్రమే ఇవ్వొచ్చు. ఒక మహిళకు తరచుగా తన కుటుంబం డబ్బును ఎలా ఖర్చు చేయాలి లేదా ఆరోగ్య సంరక్షణను ఎప్పుడు పొందాలనే నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఉండదు. అలాగే, భర్త అనుమతి లేకుండా ఆమె ఎక్కడికీ వెళ్లలేదు లేదా సమాజ నిర్ణయాల్లో పాల్గొనలేదు.

ఈ విధంగా, మహిళలకు అధికారం నిరాకరించినప్పుడు వాళ్లు మనుగడ కోసం పురుషుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా, మంచి జీవితానికి దోహదపడే విషయాల కోసం వాళ్లు సులభంగా డిమాండ్ చేయలేరు. తరచుగా, వారి భర్తలతో వారి సంబంధాల్లో వారికి అధికారం ఉండదు, ఎంత మంది పిల్లలు కనాలనే దానిపై లేదా ఇతర మహిళలతో భర్త సంబంధాల మీద కూడా వారికి తక్కువ నియంత్రణే ఉంటుంది లేదా అస్సలు నియంత్రణే ఉండదు.

Sources
  • Audiopedia ID: tel021002