ఏ హెచ్చరిక సంకేతాలను నేను పట్టించుకోవాలి
మీకు మీరే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోండి:
మీరు ఇతరులను చూసే సమయంలో అతను అసూయపడుతున్నాడా లేదంటే, మీరు అతనితో అబద్ధం చెప్పారని ఆరోపిస్తున్నాడా? అతను అసూయపడకుండా ఉండడం కోసం మీరు మీ ప్రవర్తనన మార్చుకుని ఉంటే, అతను మిమ్మల్ని నియంత్రిస్తున్నాడని అర్థం.
మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లకుండా అతను అడ్డుకుంటున్నాడా లేదంటే, మీరు సొంతగా పనులు చేసుకోలేని పరిస్థితి కల్పిస్తున్నాడా? అతను ఏ కారణం చెబుతున్నా సరే, దాన్ని పట్టించుకోకండి. వాళ్ల నుండి మీకు మద్దతు అందకుండా అతను మిమ్మల్ని నిరోధించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. మీరు వెళ్ళడానికి మరేచోటూ లేకపోతే అతను మీపట్ల దుర్వినియోగం చేయడం మరింత సులభమవుతుంది.
అతను మిమ్మల్ని అవమానిస్తున్నాడా లేదంటే, ఇతరుల ముందు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడా? అతని మాటల్ని మీరు నమ్మడం మొదలుకావచ్చు. మిమ్మల్ని అతను చెడుగా చూడడం కరెక్టే అని మీకు కూడా అనిపించవచ్చు.
కోపంగా ఉన్నప్పుడు అతనేం చేస్తాడు? వస్తువులు పగులగొట్టడం లేదా విసరడం చేస్తాడా? అతను ఎప్పుడైనా మిమ్మల్ని శారీరకంగా బాధపెట్టడం లేదంటే, మిమ్మల్ని బాధపెడతానని బెదిరించడం జరిగిందా? అతనెప్పుడైనా వేరొక మహిళను కొట్టాడా? అతను తన ప్రవర్తను నియంత్రించడంలో ఇబ్బంది పడుతున్నాడని ఇవన్నీ సూచిస్తాయి.
తన ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు లేదా అతని తండ్రి లాంటి అధికారం కలిగిన వ్యక్తుల చేతిలో తాను అవమానాలు పడ్డానని అతను భావిస్తున్నాడా? తనకు ఎలాంటి అధికారం లేదని అతను భావిస్తుండవచ్చు. హింసను ప్రయోగించడం ద్వారా తన జీవితంలోని ఇతర రంగాల్లోని ఇతరుల మీద అధికారం చెలాయించేలా ఇది అతడిని ప్రేరేపిస్తుంది.
మద్యం, మాదకద్రవ్యాలు లేదా ఒత్తిడి వల్లే తాను ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టు అతను పేర్కొంటున్నాడా? అతను వేరొక అంశం మీద నింద వేస్తున్నప్పుడు, కొత్త ఉద్యోగం వస్తే, కొత్త పట్టణానికి వెళ్లిపోతే లేదా మాదకద్రవ్యాలు లేదా మద్యం తీసుకోవడం ఆపేస్తే పరిస్థితులు మెరుగుపడతాయని అతను చెప్పవచ్చు.
తాను వ్యవహరించే తీరుకి అతను మిమ్మల్ని లేదంటే మరొకరిని నిందిస్తున్నాడా లేదంటే, తాను తప్పు చేస్తున్నప్పటికీ, దాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నాడా? అతడు తన ప్రవర్తనకు మీదే తప్పు అని భావిస్తుంటే, అతను తనను తాను మార్చుకోవాలనుకునే అవకాశం తక్కువ.