ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు బాధపెడతాడు
ఒక స్త్రీని బాధపెట్టడానికి ఒక పురుషుడు అనేక సాకులు చెప్పవచ్చు. తాను అప్పుడు త్రాగి ఉన్నానని, తాను అప్పుడు నియంత్రణ కోల్పోయానని లేదా ఆమెకి 'ఆ శాస్తి జరగాల్సిందేనని' ఏదేదో చెబుతాడు. కానీ, ఒక వ్యక్తి హింసను ఎంచుకున్నాడంటే, తనకు అవసరమైన దాన్ని పొందడానికి హింసను ఒక మార్గంగా అతను ఎంచుకున్నాడని లేదా మగాడిగా అది తన హక్కుగా భావిస్తున్నాడని అర్థం.
ఒక పురుషుడు తన జీవితం మీదే తనకి అధికారం లేదని భావించనప్పుడు, మరొక వ్యక్తి జీవితాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా హింసకు పాల్పడవచ్చు. ఎవరైనా సరే, వారి జీవితాన్ని సాధారణ మార్గాల్లో నియంత్రించుకోవాలనుకోవడం సహజమే. కానీ, వేరొకరి జీవితాన్ని నియంత్రించడానికి, మరీ ముఖ్యంగా హింసతో ఆ పని చేయాలనుకోవడం తప్పు.
కొందరు పురుషులు మహిళలను బాధపెట్టడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
హింసతోనే పని జరుగుతుంది నిజమైన సమస్య గురించి మాట్లాడకుండా లేదా నిజమైన పరిష్కారం కోసం ప్రయత్నించకుండా, తన అసమ్మతిని త్వరగా వ్యక్తీకరించడానికి పురుషుడు ఇలా చేస్తాడు. ఒక పురుషుడికి హింస ప్రేరేపకంలా అనిపించినప్పుడు, దాని నుండి అతను మరింత శక్తి పొందుతాడు. కాబట్టి, మళ్లీ మళ్లీ అలాంటి హింసకు పాల్పడాలని అతను కోరుకోవచ్చు. ఒక పురుషుడు హింసను ఉపయోగించి 'గెలుస్తాడు' మరియు తన అనుకున్నది సాధిస్తాడు. దాంతో, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, హింసను తప్పించుకోవడం కోసం బాధితురాలు అతడికి ఎదురు చెప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది పురుషుడుకి మరింత శక్తిని ఇస్తుంది. బంధం ఏదైనప్పటికీ, ఒకరి మీద మరొకరికి ఎక్కువ అధికారం ఉన్నప్పుడు తరచుగా హింస లేదా దుర్వినియోగం సంభవిస్తుంటుంది.
ఒక పురుషుడిగా ఉండడం అంటే ఏమిటనే విషయంలో పురుషుడి భావన తప్పుగా ఉండడం. ఒక పురుషుడుగా ఉండడమంటే, స్త్రీ ఏం చేయాలో తాను నియంత్రించాలని ఒక పురుషుడు భావించినప్పుడు, అందుకోసం ఆమెను హింసించడం సరైనదే అని అతను భావించవచ్చు. ఒక 'మంచి' భార్య, మంచి పిల్లలు కలిగిన కుటుంబంగా ఉండాలంటే, కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే 'హక్కు' తమకు మాత్రమే ఉంటుందని కొందరు పురుషులు భావిస్తారు. తాము పురుషులు కావడమే దానికి అర్హతగా భావిస్తారు. బంధం ఏదైనప్పటికీ, ఒకరి మీద మరొకరికి ఎక్కువ అధికారం ఉన్నప్పుడు తరచుగా హింస లేదా దుర్వినియోగం సంభవిస్తుంటుంది. స్త్రీని పురుషుడు తన ఆస్తిలా లేదా తన అవసరంగా భావిస్తాడు. స్త్రీ 'బలంగా' ఉంటే, ఆమెను తాను కోల్పోతానేమోనని లేదా ఆమెకు తన అవసరం ఉండకపోవచ్చని పురుషుడు భయపడవచ్చు. అందుకే, తన మీద ఆమె మరింత ఆధారపడేలా చేయడానికి చర్యలు తీసుకుంటాడు. మహిళలు మరియు బాలికలను పురుషులు తమ ఆస్తిగా భావించినప్పుడు, వారి పట్ల తమకు ఇష్టమైన విధంగా తమ హక్కుగా భావించే అవకాశం ఉంది.
పురుషుడు పెరిగిన తీరు కారణం. జీవితంలో కష్టాలు మరియు ఒత్తిడి ఎదురైనప్పుడు తన తండ్రి లేదా తన జీవితంలోని ఇతరులు హింసకు పాల్పడడం ఒక పిల్లాడు చూసినప్పుడు, పెద్దయ్యాక అతను కూడా అలాగే ప్రవర్తించవచ్చు. అంతకుమించి అతనికి వేరొక మార్గం తెలియకపోవచ్చు.
ఒక పురుషుడు తన భార్య పట్ల హింసాయుతంగా ప్రవర్తించడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ, కారణం ఏదైనప్పటికీ, అలా ప్రవర్తించడానికి అతనికి హక్కు లేదు.