ఒక మహిళగా HIV మరియు AIDS నుండి నన్ను రక్షించుకోవడం మరింత కీలకమా
మహిళల విషయంలో HIV మరియు AIDS తీరు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే:
పురుషుల కంటే మహిళలకు హెచ్ఐవి సులభంగా సోకుతుంది. ఎందుకంటే లైంగిక చర్య సమయంలో, ఆమె 'స్వీకర్త'గా ఉంటుంది. అంటే, పురుషుడి వీర్యం స్త్రీలో ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి, ఆ వీర్యంలో HIV ఉంటే మరియు ఆమె యోని లేదా గర్భాశయ ముఖద్వారంలో ఏవైనా కోతలు, పుండ్లు లేదా STIలు ఉంటే, అది ఆమె రక్తంలోకి సులభంగా ప్రవేశిస్తుంది.
మహిళలు చిన్న వయసులోనే ఈ ఇన్ఫెక్షన్‌కి గురవుతుంటారు. ఎందుకంటే, మహిళలు లేదా అమ్మాయిలు అవాంఛిత లేదా అసురక్షిత లైంగిక చర్యను తిరస్కరించలేరు. అలాగే, బాగా వయసు మీద పడిన వ్యక్తితో వాళ్లకి పెళ్లి చేస్తుంటారు. ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశం ఆ వ్యక్తికి ఎక్కువగా ఉంటుంది.
మహిళలు తరచుగా వారి STIల కోసం చికిత్స తీసుకోకుండానే, వాటితో సహజీవనం చేస్తుంటారు. తద్వారా, వారికి సులభంగా HIV సోకుతుంది.
ప్రసవ సమయంలో సమస్యల కారణంగా, పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎక్కువసార్లు రక్తం ఎక్కిస్తుంటారు.
సరైన పోషకాహారం లేకపోవడం మరియు ప్రసవ కారణంగా బలహీనత వల్ల తరచుగా మహిళల్లో వ్యాధితో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
చాలామంది పురుషులు కండోమ్ ధరించడానికి లేదా వారి భాగస్వాముల సంఖ్య పరిమితం చేసుకోవడానికి ఇష్టపడనప్పటికీ, యిడ్స్ వ్యాప్తి విషయంలో మహిళలనే అన్యాయంగా నిందిస్తుంటారు.
గర్భిణీ స్త్రీకి HIV సోకితే, ఆమె ద్వారా అది బిడ్డకు కూడా సోకుతుంది.
సాధారణంగా, మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఎయిడ్స్‌తో ఉన్న కుటుంబ సభ్యులకు వాళ్లే సపర్యలు చేయాల్సి ఉంటుంది.