ఒక మెరుగైన ప్రపంచం కోసం నేను నా పిల్లలను ఎలా పెంచగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పిల్లల్ని ఎలా పెంచాలనే దాని గురించి మీకు, మీ భర్తకు వేర్వేరు ఆలోచనలు ఉన్నప్పటికీ, మీ పిల్లల సంక్షేమం నిర్ధారించడం కోసం మీ మధ్య ఉండే ఏవైనా విభేదాలను చర్చించి, అంగీకరించడం చాలా ముఖ్యం. అది మీ ఇద్దరికీ నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనది.

తల్లి బాధపడుతుంటే పిల్లలు కూడా బాధపడతారు. కాబట్టి, వాళ్ల కోసం మీ విభేదాలు తగ్గించడానికి ప్రయత్నించండి లేదా వీలైతే అధిగమించండి.

అవసరమైతే మీ పిల్లల మానసిక మరియు శారీరక శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా మీ మధ్య సంతోషకర బంధం ఉత్తమమని మీ భర్తకు గుర్తు చేయండి మరియు తల్లిగా, వారి జీవితంలోని ప్రతిరోజూ, మీ పిల్లలకు మీరే ఈ విషయాలు నేర్పిస్తారు:

  • మనం మొదటగా మన భర్తకు, కుమారులకు ఆహారం అందించినప్పుడు బాలికలు, మహిళల ఆకలికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
  • మనం మన కుమారులను మాత్రమే పాఠశాలకు పంపినప్పుడు విద్య ద్వారా అందే అవకాశాలకు బాలికలు అర్హులు కాలేరు.
  • హింసాత్మకంగా ఉండడమే పురుషత్వమని మనం మన కుమారులకు నేర్పించినప్పుడు మనం మన కుమారులను హింసాత్మక పురుషులుగా పెంచుతాము.
  • మన పొరుగువారి ఇంట్లో హింసకు వ్యతిరేకంగా మనం నోరు విప్పకపోతే, పురుషుడు తన భార్యను, పిల్లలను కొట్టడం ఆమోదయోగ్యమే అని మనం మన కుమారులకు నేర్పుతాము.

తల్లులుగా, మన పిల్లలు ఎదగాలో నిర్ణయించే శక్తి మనకి ఉంటుంది. కాబట్టి, వాళ్లకి మనం ఇవి నేర్పించాలి:

  • కుమారులు దయగల వారుగా మరియు ఆదుకునే వారుగా ఉండాలి. అప్పుడే వాళ్లు దయగల భర్తలు, తండ్రులు మరియు సోదరులుగా మారగలరు.
  • కుమార్తెలు సైతం తమను తాము విలువైన వాళ్లుగా భావించాలి. అప్పుడే, వాళ్ల కుమార్తెలను వాళ్లు అలా పెంచుతారు.
  • తమ సోదరీమణులు, భార్యలు మరియు కుమార్తెల అధిక పని భారంలో భాగం వహించడాన్ని కుమారులు గర్వంగా భావించాలి.
  • పాఠశాల పూర్తి చేయడం లేదా నైపుణ్యం నేర్చుకోవడంలో కుమార్తెలు మరింత స్వతంత్రంగా ఉండాలి.
  • మహిళలందరినీ కుమారులు గౌరవంగా చూడాలి. అప్పుడే వాళ్లు తమ జీవిత భాగస్వాములను గౌరవిస్తారు.
Sources
  • Audiopedia ID: tel021017