ఒక సమూహంలోని వ్యక్తుల మధ్య లేదా సభ్యుల మధ్య నేను విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

  • తీర్పు చెప్పడానికి ప్రయత్నించకుండా, ఎదుటి వ్యక్తి చెప్పే ప్రతిఒక్కటీ వినడానికి సిద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి.
  • అవతలి వ్యక్తి ఎలా భావిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకూ అలాంటి అనుభవం ఉంటే, మీకు ఎలా అనిపించిందో ఆలోచించండి. అంతేతప్ప, వేరొకరి అనుభవాన్ని మీ అనుభవంతో సమానంగా చూడటం మానుకోండి. మీరు ఆమెను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, అర్థం చేసుకుంటున్నట్టుగా నటించకండి. ఏ ఇద్దరికి ఒకే విధమైన జీవిత అనుభవాలు ఉండవు. మరొక వ్యక్తి గురించి అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది.
  • ఎదుటి వ్యక్తి ఏం చేయాలో మీరు చెప్పకండి. తన కుటుంబం, సమాజం మరియు పని బాధ్యతల ఒత్తిళ్లు లాంటివి ఆమె భావాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడంలో మీరు ఆమెకు సహాయపడవచ్చు. అయితే, ఆమె సొంత నిర్ణయాలు ఆమె మాత్రమే తీసుకోవాలి.
  • ఒక స్త్రీ విషయంలో సహాయం చేయడానికి మించి ఇంకేమీ ఆలోచించకండి.
  • స్త్రీ గోప్యతను గౌరవించండి. ఆమె ప్రాణాలు కాపాడేందుకు అవసరమైతే తప్ప, ఆమె మీకు చెప్పినది ఇతరులెవరికీ ఎప్పుడూ చెప్పకండి. ఆమె రక్షణ కోసం మీరు వేరొకరితో మాట్లాడాలనుకుంటే ఎల్లప్పుడూ ఆమెకి ఆ విషయం ముందే చెప్పండి.

కొత్త సమూహం సృష్టించడం కంటే ఇప్పటికే ఉన్న సమూహాన్ని మద్దతు సమూహంగా మార్చడం చాలా సులభం. కానీ, సహాయ సంబంధాలు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను మరియు మీ గోప్యతను గౌరవించే వ్యక్తులతో మాత్రమే సంబంధాలు ఏర్పరచుకోండి.

Sources
  • Audiopedia ID: tel011513