ఒత్తిడి కారణంగా ఎదురయ్యే శారీరక మార్పులు మరియు వ్యాధుల గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక వ్యక్తి ఒత్తిడిని అనుభవించినప్పుడు, దానికి త్వరగా స్పందించడానికి మరియు ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి వారి శరీరం సిద్ధంగా ఉంటుంది. ఆ సందర్భంగా సంభవించే కొన్ని మార్పులు:

  • గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది.
  • రక్తపోటు పెరుగుతుంది.
  • ఆ వ్యక్తి వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు.
  • జీర్ణక్రియ మందగిస్తుంది.

ఒత్తిడి అనేది అకస్మాత్తుగా మరియు తీవ్రంగా ఉంటే, ఒక మహిళ తన శరీరంలో ఈ మార్పులు అనుభవించవచ్చు. ఆతర్వాత, ఒత్తిడి పోయిన తర్వాత, ఆమె శరీరం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ ఒత్తిడి తక్కువ తీవ్రంగా ఉంటే లేదా నెమ్మదిగా సంభవిస్తే, ఆమెలో సంకేతాలు ఉన్నప్పటికీ, ఆ ఒత్తిడి తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆమె గమనించలేకపోవచ్చు. ఒత్తిడి అనేది ఎక్కువ కాలం కొనసాగితే, ఆందోళన మరియు నిరాశ సమయంలో సర్వసాధారణంగా కనిపించే తలనొప్పి, పేగు సమస్యలు మరియు శక్తి లేకపోవడం లాంటి శారీరక సంకేతాలకు దారితీస్తుంది. ఒత్తిడి అనేది కాలక్రమేణా గుండెపోటు లేదా పక్షవాతానికి దారితీసే అధిక రక్తపోటు లాంటి అనారోగ్యానికి కూడా కారణమవుతుంది.

అనేక ప్రదేశాల్లో, భావోద్వేగ సమస్యలను శారీరక సమస్యలు లాగా ముఖ్యమైనవిగా పరిగణించరు. ఇలా జరిగినప్పుడు, ఇతర సంకేతాల కంటే, అక్కడి ప్రజలు ఆందోళన మరియు నిరాశ సంబంధిత శారీరక సంకేతాలు కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక సంకేతాలను విస్మరించకపోవడం ముఖ్యమే అయినప్పటికీ, అనారోగ్యం సంబంధిత భావోద్వేగ కారణాల పట్ల కూడా సున్నితంగా ఉండడం చాలా ముఖ్యం.

Sources
  • Audiopedia ID: tel011510