ఒత్తిడి కారణంగా లేదా బలవంతపు సెక్స్ ఏమిటి
From Audiopedia
మీకు ఇష్టం లేనప్పటికీ, ఎవరైనా మీతో బలవంతంగా సెక్స్ చేస్తే దానిని అత్యాచారం అంటారు.
ప్రపంచవ్యాప్తంగా, యువతులు మరియు మహిళలు వారి ఇష్టం లేనప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి వస్తోంది. తరచుగా, ప్రేమ పేరుతో వారి ప్రియులే ఈవిధంగా చేస్తుంటారు. కొన్ని చోట్ల దీన్నే 'డేట్ రేప్' అని పిలుస్తారు. ఈ బలవంతం అనేది భౌతికమైనది మాత్రమే కాకపోవచ్చు. మాటలు లేదా భావ ప్రకటనల రూపంలోనూ మీకు ఈ ఒత్తిడి ఎదురుకావచ్చు. అతను మిమ్మల్ని బెదిరించవచ్చు లేదా \"బ్రతిమాలవచ్చు\" లేదా మీరు సెక్స్‌కి సిద్ధం కాకపోవడం పట్ల మీ మీద మీకే అపరాధ భావన లేదా మీరు సిగ్గుపడే పరిస్థితి కల్పించవచ్చు. ఇలా చేయడం కూడా తప్పే.
మహిళకి సెక్స్ ఇష్టం లేనప్పుడు దానికోసం ఏ ఒక్కరూ, ఏవిధంగానూ బలవంతం చేయకూడదు.