ఒత్తిడి రూపంలో లేదా బలవంతపు సెక్స్‌ని నేనెలా నిరోధించగలను
అతను మీతో సెక్స్ కోరుకున్నప్పుడు మీకు ఇష్టం లేకపోతే, మీ మాటలు నాకు హాయిగా ఉన్నప్పటికీ, నాకిప్పుడు సెక్స్ కోరిక లేదని మీరు అతనితో చెప్పవచ్చు. ఆ వ్యక్తితో ఒంటరిగా ఉండడానికి మీరు భయపడితే, మీతో ఎవరినైనా తోడు తెచ్చుకోండి లేదా అతనితో మాట్లాడాల్సిందిగా వేరొకరిని కోరండి.
సెక్స్ కోసం మీ మీద ఒత్తిడి తెస్తే, \"వద్దు\" అని గట్టిగా చెప్పండి. సెక్స్ కావాలని మీకూ అనిపించే వరకు \"వద్దు\" అని చెబుతూ ఉండండి. వద్దు అని మీ శరీరానికి కూడా చెప్పండి. మీరు మాటలతో \"వద్దు\" అని చెప్పి, శారీరకంగా లొంగిపోతే, నిజానికి మీరు సెక్స్‌కి \"సరే\" అంటున్నారని అతను భావిస్తాడు. మీకు నచ్చని విధంగా మిమ్మల్ని తాకితే, పరిస్థితి ఇంకా ముదిరే అవకాశం ఉందని మీ భావాలు మిమ్మల్ని హెచ్చరిస్తే అతడికి దూరంగా వెళ్లండి. పెద్దగా శబ్దం చేయండి మరియు అవసరమైతే పరుగెత్తడానికి సిద్ధంగా ఉండండి.
మద్యం సేవించకండి లేదా మాదకద్రవ్యాలు తీసుకోకండి. మద్యం మరియు మాదకద్రవ్యాల ప్రభావంలో మీరు మీ నిర్ణయాన్ని గట్టిగా అమలు చేయలేరు. అవి మీ మీద మీకు నియంత్రణను తగ్గిస్తాయి.
బయటకు వెళ్లేటప్పుడు సమూహంగా వెళ్లండి. అనేక ప్రదేశాల్లో, యువ జంటలు గుంపుగా లేదా సమూహాలుగా డేటింగ్ చేస్తుంటారు. అలాంటిచోట మీరు ఆ అబ్బాయి గురించి తెలుసుకోవచ్చు. అలాగే, అక్కడ మీరు ఒంటరిగా ఉండరు కాబట్టి, అతడు సెక్స్ కోసం ఒత్తిడి చేసే పరిస్థితి తక్కువగా ఉంటుంది.
ఇతరులు మిమ్మల్ని చూడగలిగే సురక్షిత ప్రదేశాలకు మాత్రమే వెళ్లండి.
ముందుగానే సిద్ధంగా ఉండండి. మీకు ఏమేరరకు స్పర్శ సరిపోతుందో నిర్ణయించుకోండి. మీ భావాలకు లొంగిపోయి, పరిస్థితిని చేయి దాటనివ్వకండి.