కంబైన్డ్ పిల్స్‌తో సాధారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

క్రమరహిత రక్తస్రావం లేదా మరకలు కనిపించడం (మీ సాధారణ నెలసరి రక్తస్రావంతో పాటు ఇతర సమయాల్లోనూ రక్తస్రావం కనిపించడం). కంబైన్డ్ పిల్స్‌తో మీ నెలసరి రక్తస్రావం తరచుగా తక్కువగా మరియు పలుచగా ఉంటుంది. కొన్నిసార్లు మీ నెలసరి రక్తస్రావం ఆలస్యం కావడం కూడా సాధారణమే. కంబైన్డ్ పిల్స్‌తో ఎదురయ్యే అత్యంత సాధారణ దుష్ప్రభావం ఇది. మరకలు పడడం కొనసాగుతుంటే, ప్రతిరోజూ ఒకే సమయంలో పిల్ తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త వహించండి. మరకలు కొనసాగితే, ప్రొజెస్టిన్ లేదా ఈస్ట్రోజెన్ మోతాదులు మార్చడం వల్ల ఉపయోగం ఉంటుందా అని ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి. నిర్ధిష్ట సమయంలో మీకు నెలసరి రక్తస్రావం రాకపోతే మరియు మీరు కొన్ని పిల్స్ వేసుకోవడం మర్చిపోతే, మీ పిల్స్ తీసుకోవడం కొనసాగించండి. అయితే, అదేసమయంలో, మీరు గర్భవతిగా ఉన్నారా అని నిర్ధారించుకోవడం కోసం ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లండి.

వికారంగా ఉండడం, అంటే, వాంతి వచ్చేలా అనిపిస్తుంటే, సాధారణంగా 1 లేదా 2 నెలల తర్వాత ఆ భావన పోతుంది. ఈ పరిస్థితి మీకు ఇబ్బంది కలిగిస్తుంటే, ఆహారంతో పాటు లేదా రోజులో వేరే సమయంలో మాత్రలు తీసుకోవడానికి ప్రయత్నించండి. కొందరు మహిళల ప్రకారం, రాత్రి నిద్రపోయే ముందు మాత్ర తీసుకోవడం సహాయకరం కాగలదు. మొదటి కొన్ని నెలల్లో తేలికపాటి తలనొప్పి సాధారణం. తేలికపాటి నొప్పి మందులు ఉపశమనం అందించగలవు. అయితే, తలనొప్పి తీవ్రంగా ఉంటే లేదా కంటి చూపు అస్పష్టంగా ఉంటే, అది తీవ్రమైన హెచ్చరిక సంకేతం కావచ్చు.

జనన నియంత్రణ పిల్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, మీ శరీరంలో ఏవైనా మార్పుల వల్ల మీరు బాధపడుతుంటే, ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి. వాళ్లు మీకు వేరే మాత్రలు సూచించవచ్చు.

మీరు పిల్స్ తీసుకుంటున్న సమయంలో, వేరొక ఔషధం తీసుకోవాల్సి వస్తే, మీరు ఆ సమయంలో అడ్డంకి పద్ధతిని ఉపయోగించాలా అనే విషయమై మీ ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి. కొన్ని యాంటీబయాటిక్స్ మరియు ఇతర ఔషధాలు, పిల్స్‌ని తక్కువ ప్రభావవంతంగా చేస్తాయి.

Sources
  • Audiopedia ID: tel020423