కంబైన్డ్ పిల్స్ ఈస్ట్రోజెన్ ప్రోజెస్టిన్ మాత్రలు గురించి ఏమి తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీరు ప్రతిరోజూ ఒక మాత్ర తీసుకున్నంత కాలం కుటుంబ నియంత్రణ మాత్రలు మీకు గర్భం రాకుండా రక్షిస్తాయి. వివిధ రకాల ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిన్ మోతాదుల మార్పులతో అనేక విభిన్న బ్రాండ్లు ఈ కంబైన్డ్ పిల్స్ అందిస్తున్నాయి. సర్వసాధారణ కంబైన్డ్ పిల్స్‌ 20,30 లేదా 35 మైక్రోగ్రాములు (mcg) ఈస్ట్రోజెన్‌తో \"తక్కువ మోతాదు\" పిల్స్‌గా అందుబాటులో ఉన్నాయి. తక్కువ మోతాదు మాత్రలు మరియు మినీ మాత్రలు భిన్నమైనవి. తక్కువ మోతాదు మాత్రల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిన్ రెండూ ఉంటాయి. అయితే, మినీ మాత్రలో ప్రొజెస్టిన్ మాత్రమే ఉంటుంది. 50 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ ఈస్ట్రోజెన్‌తో ఉండే పిల్స్ ఎప్పుడూ ఉపయోగించకండి.

కంబైన్డ్ పిల్స్ సాధారణంగా కుటుంబ నియంత్రణ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, మందుల దుకాణాలు మరియు ఆరోగ్య కార్యకర్తల వద్ద లభిస్తాయి.

మీరు పిల్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, ఒకే బ్రాండ్‌కి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి (మరియు మీకు వీలైతే, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్యాకెట్లు కొనుగోలు చేయండి). మీరు బ్రాండ్ మార్చవలసి వస్తే, అదే రకమైన హార్మోన్ పేర్లు మరియు మోతాదు కలిగిన వాటిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు తక్కువ దుష్ప్రభావాలు మరియు మెరుగైన రక్షణ ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel020421