కొందరు మహిళలకు నిర్ధిష్ట ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్లు ఈ పిల్స్ ఉపయోగిస్తే, వాళ్ల పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు.
పైన పేర్కొన్న పరిస్థితులతో పాటు మీకు క్రింది సమస్యలు కూడా ఉంటే, పిల్స్ తీసుకోకండి:
కాలేయ వ్యాధి అయిన హెపటైటిస్ లేదా చర్మం మరియు కళ్లు పసుపుగా ఉంటే.
మీకు ఎప్పుడైనా స్ట్రోక్, పక్షవాతం లేదా గుండె జబ్బుల సంకేతాలు కనిపించి ఉంటే.
మీ కాళ్ళ సిరల్లో లేదా మీ ఊపిరితిత్తుల్లో లేదా మెదడులో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉంటే. సిరలు ఎర్రటి రంగులో మరియు వాపుతో ఉంటే తప్ప, వెరికోస్ సిరల వల్ల సాధారణంగా సమస్యేమీ ఉండదు.
మీకు క్రింది ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, కంబైన్డ్ పిల్స్ పద్ధతి కాకుండా వేరొక పద్ధతి ఉపయోగించే ప్రయత్నం చేయండి. అలా చేయలేని పక్షంలో, గర్భవతి కావడం కంటే మీరు కంబైన్డ్ పిల్స్ తీసుకోవడమే మంచిది.
మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే, ఈ పిల్స్ తీసుకోకండి:
తల్లిపాలు ఇస్తుంటే, కంబైన్డ్ పిల్స్ తీసుకోవడం ప్రారంభించే ముందు మీ రొమ్ముల నుండి చక్కగా పాలు వచ్చే వరకు వేచి ఉండండి. ఇందుకోసం, ప్రసవం తర్వాత, సాధారణంగా 3 వారాల వరకు పడుతుంది.
మీరు పొగ తాగుతుంటే మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు మీరు కంబైన్స్ పిల్స్ తీసుకుంటే మీకు స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీకు మధుమేహం లేదా మూర్ఛ ఉంటే. మీరు మూర్ఛ (\"ఫిట్స్\") కోసం మందులు తీసుకుంటూ ఉంటే, మీరు ఎక్కువ మోతాదు (50 మైక్రోగ్రాముల ఈస్ట్రోజెన్) పిల్స్ తీసుకోవాల్సి ఉంటంది. కాబట్టి, ఆరోగ్య కార్యకర్త లేదా వైద్యుడి నుండి వైద్య సలహా తీసుకోండి.
అధిక రక్తపోటు (140/90 కంటే ఎక్కువ) ఉంటే. మీకు అధిక రక్తపోటు ఉందని మీకు ఎప్పుడైనా చెప్పి ఉంటే లేదా మీకు ఆ పరిస్థితి ఉండవచ్చని మీరు భావిస్తే, ఆరోగ్య కార్యకర్త వద్ద మీ రక్తపోటు తనిఖీ చేయండి. మీరు అధిక బరువుతో ఉంటే, మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే, సులభంగా గస వస్తుంటే, బలహీనంగా లేదా మగతగా అనిపిస్తుంటే లేదా ఎడమ భుజంలో లేదా ఛాతీలో నొప్పి అనిపిస్తుంటే మీరు అధిక రక్తపోటు కోసం పరీక్ష చేయించుకోవాలి.