కంబైన్డ్ బర్త్ కంట్రోల్ పిల్స్‌ని నేను ఏవిధంగా తీసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

21 లేదా 28 పిల్స్ ఉండే ప్యాకెట్ల రూపంలో ఈ పిల్స్ లభిస్తాయి. మీ వద్ద ఉన్నది 28 రోజుల ప్యాకెట్ అయితే, నెలలో ప్రతిరోజూ ఒక మాత్ర తీసుకోండి. ఒక ప్యాకెట్ పూర్తి చేసిన వెంటనే, మరొక ప్యాకెట్ నుండి పిల్స్ వేసుకోవడం ప్రారంభించండి. (28 రోజుల ప్యాకెట్‌లో చివరి 7 రోజుల కోసం ఉద్దేశించిన మాత్రలు చక్కెరతో తయారు చేయబడతాయి. వాటిలో హార్మోన్లు ఉండవు. ప్రతిరోజూ ఒక మాత్ర తీసుకోవడాన్ని గుర్తుంచుకోవడంలో ఈ చక్కెర మాత్రలు మీకు సహాయపడతాయి.)

మీ వద్ద ఉన్నది 21 రోజుల ప్యాకెట్ అయితే, 21 రోజులు ప్రతిరోజూ ఒక మాత్ర తీసుకోండి. ఆతర్వాత, కొత్త ప్యాకెట్ ప్రారంభించే ముందు 7 రోజులు వేచి ఉండండి. సాధారణంగా, మీరు మాత్రలు తీసుకోని రోజుల్లో మీ నెలసరి రక్తస్రావం జరుగుతుంది. అయితే, మీ ఆరోజుల్లో మీకు నెలసరి రక్తస్రావం రాకపోయినప్పటికీ, 7 రోజులు పూర్తి కాగానే మీరు కొత్త ప్యాకెట్ ప్రారంభించాలి.

21-రోజులు మరియు 28-రోజులు ప్యాకెట్ ఏది ఉన్నప్పటికీ, మీ నెలసరి రక్తస్రావం మొదటి రోజున మొదటి మాత్ర తీసుకోండి. తద్వారా, మీకు మొదటిరోజు నుండే రక్షణ లభిస్తుంది. రక్తస్రావం మొదటిరోజు కాకుండా, ఆ తర్వాత మీరు మాత్ర తీసుకుంటే, మీ నెలసరి చక్రంలోని మొదటి 7 రోజుల్లో ఏదో ఒక రోజు నుండి మీరు పిల్స్ ప్రారంభించవచ్చు. అయితే, మీకు అదే రోజు నుండి రక్షణ ఉండదు. కాబట్టి, మీరు పిల్స్ మొదలుపెట్టినప్పటికీ, మొదటి 2 వారాల పాటు వేరొక కుటుంబ నియంత్రణ పద్ధతి కూడా ఉపయోగించాలి లేదంటే, లైంగిక చర్యకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో పిల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వారంలోని అదే రోజున మీరు ఎల్లప్పుడూ కొత్త ప్యాకెట్ ప్రారంభిస్తారని గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడగలదు.

Sources
  • Audiopedia ID: tel020425