కటి పరీక్షలో ఏయే దశలు ఉంటాయి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీ జననేంద్రియం వెలుపలి భాగంలో ఏదైనా వాపు, గడ్డలు, పుండ్లు లేదా రంగులో ఏవైనా మార్పులు ఉన్నాయా అని ఆరోగ్య కార్యకర్త పరిశీలిస్తారు.

సాధారణంగా, ఆరోగ్య కార్యకర్త మీ యోనిలోకి ఒక స్పెక్యులమ్ చొప్పిస్తారు. స్పెక్యులమ్ అనేది లోహం లేదా ప్లాస్టిక్‌తో తయారైన ఒక చిన్న పరికరం. యోని లోపలి భాగం తెరచి ఉండేలా ఇది పట్టుకుంటుంది. తద్వారా, యోని మరియు గర్భాశయ ముఖద్వారం లోపల ఏదైనా వాపు, గడ్డలు, పుండ్లు లేదా స్రావాలు ఉన్నాయా అని అతను లేదా ఆమె పరిశీలించడానికి వీలవుతుంది. స్పెక్యులమ్ చొప్పించడం వల్ల మీకు కొంచెం ఒత్తిడి లేదా అసౌకర్యం ఎదురుకావచ్చు. అయితే, దానివల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మీ కండరాలు విశ్రాంతిగా, మీ మూత్రాశయం ఖాళీగా ఉంటే, ఈ పరీక్ష మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆ వైద్యశాలలో ప్రయోగశాల సేవలు కూడా ఉంటే, అవసరమైన పక్షంలో, STIల కోసం కూడా ఆరోగ్య కార్యకర్త మీకు పరీక్షలు చేస్తారు. గర్భాశయ ముఖద్వారంలో భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న ఏవైనా మార్పుల కోసం కూడా ఆరోగ్య కార్యకర్త పరీక్షిస్తారు. ఇందుకోసం పాప్ పరీక్ష, గర్భాశయ ముఖద్వారాన్ని పరిశీలించడం లేదా గర్భాశయ క్యాన్సర్‌కి కారణమయ్యే HPV అనే వైరస్‌ను గుర్తించడం కోసం పరీక్ష లాంటివి చేయవచ్చు. ఈ పరీక్షలేవీ నొప్పితో కూడినవి కావు. స్పెక్యులమ్ చొప్పించడం ద్వారా, ఈ పరీక్షలు చేస్తారు. క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స చేస్తే, చాలా సందర్భాల్లో పూర్తిగా నయం చేయవచ్చు.


స్పెక్యులమ్ తొలగించిన తర్వాత, ఆరోగ్య కార్యకర్త ఒక చేతికి ఒక శుభ్రమైన ప్లాస్టిక్ గ్లౌజు ధరించి, రెండు వేళ్ళను మీ యోనిలోకి చొప్పిస్తుంది. మరొక చేతిని మీ పొత్తి కడుపు మీద ఉంచి, మెల్లగొ నొక్కుతుంది. తద్వారా, మీ గర్భాశయం, నాళాలు మరియు అండాశయాల పరిమాణం, ఆకారం మరియు వాటి స్థానం గురించి ఆమె అనుభూతి చెందుతుంది. ఈ పరీక్ష సమయంలోనూ మీకు ఎలాంటి నొప్పి ఉండకూడదు. ఒకవేళ ఉంటే, ఆమెతో ఆ విషయం చెప్పండి. ఏదో సమస్య ఉందనేందుకు మీ నొప్పి సంకేతం కావచ్చు.


మరికొన్ని సమస్యల కోసం, ఆరోగ్య కార్యకర్త మీకు మలద్వారా పరీక్ష కూడా చేయవచ్చు. ఆమె తన ఒక వేలుని మీ యోనిలోకి మరియు ఒక వేలుని మీ మలద్వారంలోకి చొప్పిస్తుంది. తద్వారా, యోనితో పాటు గర్భాశయం, నాళాలు మరియు అండాశయాల సంభావ్య సమస్యల గురించి ఆరోగ్య కార్యకర్తకు మరింత సమాచారం లభించగలదు.

Sources
  • Audiopedia ID: tel010204