కట్నం సంబంధిత సంఘర్షణలను నేను ఎలా ఎదుర్కోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

అనేక దేశాల్లో (ఉదాహరణకు భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ మరియు కెన్యాలో) వివాహం కోసం కట్నం పేరుతో అమ్మాయి ఇంటి వారి నుండి ఏదైనా మొత్తం అభ్యర్థించడం, చెల్లించడం చట్ట ప్రకారం నేరం. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదు.

దురదృష్టవశాత్తూ, ఇప్పటికీ, చాలా కుటుంబాల వారికి ఈ చట్టాల గురించి మరియు వివాహం కోసం కట్నం డిమాండ్ చేసినప్పుడు ఆడపిల్లలకు మరియు వారి కుటుంబాలకు అందుబాటులో ఉన్న సహాయం గురించి తెలియదు. మరోవైపు, తెలిసినప్పటికీ, ఆ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే, తమ సామాజిక హోదా దెబ్బతింటుందని కొందరు భావిస్తుంటారు. కాబట్టి, చట్ట ప్రకారం నేరమైనప్పటికీ, తరచుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

కట్నం సమస్యలతో ముడిపడిన వివాదాలు ఇప్పటికీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అత్తామామలకు సంతృప్తికరమైన కట్నం లభించనప్పుడు, వాళ్లు తమ కోడలి పట్ల దుర్వినియోగానికి పాల్పడుతుంటారు. ఆమె తన తల్లిదండ్రుల ఇంటి నుండి తగినంత పెద్ద కట్నం తీసుకురాకపోతే, తమ కుమారుడితో చెప్పి ఆమెని వదిలించుకుంటామని కూడా బెదిరిస్తుంటారు.

కట్నం సంబంధిత వివాదంతో మీ భర్త కుటుంబంలో మీ మీద దుర్వినియోగానికి పాల్పడుతుంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి క్రింది వ్యూహాలు మీకు సహాయపడవచ్చు:

1. సమాచారం మరియు సహాయం కోసం అడగడానికి మీ ప్రాంతంలోని మహిళా సంస్థను సంప్రదించే ప్రయత్నం చేయండి (అందుబాటులో ఉంటే).

2. అది సాధ్యం కాకపోతే, మీరు విశ్వసించే అధికారంలో ఉన్న వారితో (ఉదాహరణకు ఆరోగ్య కార్యకర్త లేదా మీ సమాజంలోని మత నాయకుడు) లేదా వరకట్నం వివాదాల్లో అనుభవం కలిగిన వారిగా మీకు తెలిసిన ఇతర మహిళలతో మాట్లాడటానికి ప్రయత్నించండి. మీరొక్కరే అలాంటి సమస్యతో బాధపడటం లేదు కాబట్టి వారిలో కొందరు మీకు మద్దతు ఇవ్వవచ్చు లేదా సలహా ఇవ్వవచ్చు.

3. మీకు సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పొరుగువారిని మరియు బంధువులను కనుగొనడానికి ప్రయత్నించండి. అనేక సందర్భాల్లో, మీ తరఫున జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కొద్దిమంది వ్యక్తులు మీ అత్తమామలకు నచ్చచెప్పగలరు లేదా హెచ్చరించగలరు.

4. మీ తల్లిదండ్రులు, సోదరులు మరియు ఇతర కుటుంబ బంధువులతో మాట్లాడండి. ఎందుకంటే, మీ సోదరులతో సమానంగా మీ కుటుంబం నుండి మద్దతు మరియు సహాయం పొందడానికి మీకూ హక్కు ఉంది. అవసరమైతే, మిమ్మల్ని దుర్వినియోగం మరియు/లేదా హింస నుండి రక్షించడానికి మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ కుటుంబానికి ఉంది. మీ తల్లిదండ్రులు మరియు బంధువులు మీ ప్రాణాలు కాపాడటానికి మరియు మీకు కొత్త జీవితం అందించడంలో మీకు సహాయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి, వారి సహాయం కోరడం వల్ల మీరేమీ ఎవరి దయ మీదో ఆధారపడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం లేదు. మీ పుట్టింటివారు మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లడానికి మరియు మళ్లీ వాళ్ల ఇంట్లోకి మిమ్మల్ని స్వాగతించడానికి ఇష్టపడకపోతే, మీ మీద జరుగుతున్న దుర్వినియోగానికి మరియు ఏదైనా పరిస్థితిలో మీరు హత్యకి గురైతే, మీ అత్తమామలతో సమానంగా వాళ్లూ దోషులుగా ఉంటారని వాళ్లకి చెప్పండి.

5. వరకట్నం నిషేధించబడిన మరియు చట్టం ద్వారా శిక్షించదగిన నేరంగా ఉన్న దేశంలో మీరు నివసిస్తుంటే, మీరు చట్టపరమైన చర్యలను కూడా ఆశ్రయించవచ్చు. అయితే, పోలీసుల వద్దకు లేదా కోర్టుకు వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే, ఇప్పటికీ, వరకట్నం ఆచరణలో ఉన్న అనేక దేశాల్లో, దురదృష్టవశాత్తూ, న్యాయ వ్యవస్థ తరచుగా అసమర్థంగా మరియు డబ్బున్న వారికి చుట్టుంగా ఉంటోంది. కాబట్టి, అక్కడ మీ ప్రయత్నాలన్నీ వృధా కావచ్చు. కాబట్టి మీ పోరాట మార్గాన్ని తెలివిగా ఎంచుకోండి మరియు వీలైతే, ఏదైనా చర్య తీసుకునే ముందు ఏదైనా మహిళా సంస్థను సంప్రదించండి. మీ విజయావకాశాలు అంచనా వేయడానికి అది మీకు సహాయపడుతుంది.

ఒక మహిళకు ధర నిర్ణయించే హక్కు గానీ, ఆమె తీసుకువచ్చే డబ్బు మరియు వస్తువుల ఆధారంగా, వివాహంలో ఆమెని అంగీకరించే లేదా తిరస్కరించే హక్కు గానీ ఏ పురుషుడికీ లేదు. ఒక వ్యక్తిగా గౌరవం, సముచిత న్యాయం అందుకోవడానికి ప్రతి స్త్రీ అర్హురాలు.

Sources
  • Audiopedia ID: tel021015