కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవరోధ పద్ధతులు ఎలా పనిచేస్తాయి
From Audiopedia
అవరోధ పద్ధతులనేవి అండం వద్దకి వీర్యం చేరకుండా నిరోధించడం ద్వారా గర్భధారణను అడ్డుకుంటాయి. స్త్రీ లేదా పురుషుడి శరీరం పనిచేసే విధానాన్ని ఇవి మార్చవు మరియు ఇవి చాలా తక్కువ దుష్ప్రభావాలు కలిగిస్తాయి. ఒక మహిళ తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఈ అడ్డంకి పద్ధతులు సురక్షితంగా ఉంటాయి. ఈ పద్ధతులు చాలావరకు HIVతో సహా STIల నుండి కూడా రక్షిస్తాయి. ఒక మహిళ గర్భవతి కావాలనుకున్నప్పుడు, ఆమె తన అవరోధ పద్ధతిని ఉపయోగించడం మానేస్తే సరిపోతుంది.
కండోమ్, మహిళల కండోమ్లు, డయాఫ్రాగమ్ మరియు స్పెర్మిసైడ్లు లాంటి వాటిని అత్యంత సాధారణ అవరోధ పద్ధతులుగా చెప్పవచ్చు.