కుటుంబ నియంత్రణకు సంబంధించిన శ్లేష్మం పద్ధతి ఎలా పనిచేస్తుంది
శ్లేష్మం పద్ధతి ఉపయోగించడానికి, మీరు మీ యోనిలోని శ్లేష్మం (తడి) స్థితి మీద జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి వీలుగా మీరు ఫలవంతంగా ఉండే సమయంలో మీ శరీరంలో తడి శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీరు ప్రతిరోజూ మీ శ్లేష్మం స్థితిని తనిఖీ చేస్తే, మీరు ఎప్పుడు ఫలవతంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి, ఆ సమయంలో మీరు లైంగిక చర్యనునివారించవచ్చు.
మీరు ఎప్పుడు ఫలవంతంగా ఉన్నారో ఎలా చెప్పవచ్చు:
1. మీ వేలితో లేదా కాగితం ముక్కతో లేదా వస్త్రంతో మీ యోని వెలుపలి భాగం తుడవండి. 2. శ్లేష్మం ఉన్నట్టు తెలిస్తే, మీ వేళ్ల మధ్యలోకి తీసుకోండి. అది ఎలా అనిపిస్తోంది? తడిగా మరియు జారుడుగా అనిపిస్తోందా? పొడిగా మరియు జిగటగా అనిపిస్తోందా?
స్పష్టంగా, తడిగా, జారుడుగా ఉండే శ్లేష్మం = మీరు ఫలవంతంగా ఉన్నారు తెల్లగా, పొడిగా, జిగటగా ఉండే శ్లేష్మం = మీరు ఫలవంతంగా లేరు