కుటుంబ నియంత్రణ అంటే ఏమిటి
From Audiopedia - Accessible Learning for All
మీరు కోరుకున్నంత మంది పిల్లలు పుట్టిన తర్వాత లేదా మీకు మరో సంతానం కావాలని మీరు కోరుకునే వరకు పిల్లలు పుట్టకుండా అనుసరించే పద్ధతినే కుటుంబ నియంత్రణ అని పిలుస్తారు. పిల్లలు కనడానికి కొన్నాళ్లు వేచి ఉండాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, ఆ సమయం వరకు గర్భం రాకుండా నిరోధించడానికి ఉన్న అనేక పద్ధతుల్లో ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ పద్ధతులనే కుటుంబ నియంత్రణ పద్ధతులు, పిల్లల మధ్య అంతరం పద్ధతులు లేదా గర్భనిరోధక పద్ధతులు అని పిలుస్తారు.