కుటుంబ నియంత్రణ అనేది ఎల్లప్పుడూ నా ఎంపికగానే ఉండాల్సిన అవసరమేమిటి
కొంతమంది మహిళలు చాలా మంది పిల్లలు కావాలని కోరుకుంటారు-ప్రత్యేకించి, భూమి, వనరులు మరియు సామాజిక ప్రయోజనాల్లో న్యాయమైన వాటా నిరాకరించబడే సమాజాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే, పిల్లలు ఎక్కువమంది ఉంటే, వాళ్లు పనిలో సహాయపడతారు మరియు వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులను చూసుకుంటారు. ఇలాంటి సమాజాల్లో, తక్కువ సంఖ్యలో పిల్లలు కలిగి ఉండటం అనేది ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే హక్కులా ఉండవచ్చు.
అయితే, తమకి తక్కువమంది పిల్లలు చాలని ఇతర సమాజాల్లోని మహిళలు కోరుకోవచ్చు. మహిళలు చదువుకోవడానికి మరియు ఆదాయం సంపాదించేందుకు అవకాశాలు ఉన్న చోట మరియు పురుషులతో మరింత సమాన స్థాయిలో చర్చలు జరపగలిగే సమాజాల్లో తరచుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది.
అయితే, ఒక మహిళ ఎక్కడ నివసించినప్పటికీ, ఆమెకు ఎంత మంది పిల్లలు ఉండాలనే విషయంలో నియంత్రణ ఆమె చేతిలో ఉన్నప్పుడే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. అయినప్పటికీ, కుటుంబ నియంత్రణ ఉపయోగించాలా, వద్దా అని నిర్ణయించుకోవడం ఎల్లప్పుడూ స్త్రీల ఎంపికగానే ఉంటుంది. కుటుంబ నియంత్రణ గురించి మీ స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు ఉంది.