కుటుంబ నియంత్రణ కోసం అందుబాటులో ఉన్న శాశ్వత పద్ధతులేవి

From Audiopedia
Jump to: navigation, search

ఒక పురుషుడు లేదా స్త్రీకి ఇకపై పిల్లలు పుట్టడం దాదాపుగా అసాధ్యం చేసే పద్ధతులూ ఉన్నాయి. ఈ తరహా శస్త్రచికిత్సలు శాశ్వతమైనవి కాబట్టి, ఇకపై పిల్లలు అక్కర్లేదని ఖచ్చితంగా నిర్ణయించుకున్న మహిళలు లేదా పురుషులకు మాత్రమే ఇవి మంచివి.

ఇకపై పిల్లలు వద్దని చేయించుకునే శస్త్రచికిత్సను స్టెరిలైజేషన్ అంటారు లేదా

  • వాసెక్టమీ (పురుషుడికి చేసేది)
  • ట్యూబెక్టమీ (స్త్రీకి చేసేది)

అని పిలుస్తారు.ఈ శస్త్రచికిత్స వేగంగా చేయవచ్చు మరియు సురక్షితమైనది మరియు దుష్ప్రభావాలు ఉండవు.

గుర్తుంచుకోండి: స్టెరిలైజేషన్ అనేది HIVతో సహా STIల నుండి రక్షణ కల్పించదు. కాబట్టి, ఈ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఇతర మార్గాల గురించి ఆలోచించాల్సిందే.

Sources
  • Audiopedia ID: tel020517