కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించే హార్మోన్ల పద్ధతుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయా

From Audiopedia
Jump to: navigation, search

ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఏవైతే హార్మోన్లు ఆమె శరీరంలో తయారవుతాయో అవే హార్మోన్లు ఈ హార్మోనల్ పద్ధతుల్లోనూ ఉంటాయి. కాబట్టి, ఈ పద్ధతులు ఉపయోగించినప్పుడు మొదటి కొన్ని నెలల్లో ఈ పరిస్థితులు ఎదురుకావచ్చు:

  • వికారం
  • తలనొప్పి
  • రొమ్ముల్లో వాపు
  • బరువు పెరగడం
  • నెలసరి రక్తస్రావంలో మార్పులు

ఈ రకమైన దుష్ప్రభావాలనేవి మొదటి 2 లేదా 3 వారాలు లేదా నెలల్లో తగ్గిపోతేయా. ఒకవేళ, అలా తగ్గకపోతే మరియు అవి మీకు ఇబ్బంది పెడుతుంటే లేదా ఆందోళన కలిగిస్తుంటే, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. మీ హార్మోన్ల పద్ధతిలో హార్మోన్ల మోతాదు మార్చడం లేదా ఆ పద్ధతులనే పూర్తిగా మార్చేయడం లాంటి విషయాల్లో వాళ్లు మీకు సహాయపడగలరు. ప్రతి హార్మోన్ల పద్ధతిలో సర్వ సాధారణమైన నిర్దిష్ట దుష్ప్రభావాల గురించి మరింత సమాచారం కోసం, సంబంధిత విభాగాలు చదవండి.

Sources
  • Audiopedia ID: tel020419