కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించే హార్మోన్ పద్ధతులు ఎలా పనిచేస్తాయి

From Audiopedia
Jump to: navigation, search

ఈ పద్ధతుల కోసం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉపయోగిస్తారు. ఒక మహిళ శరీరంలో తయారయ్యే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఇవి పోలి ఉంటాయి. హార్మోన్ల పద్ధతుల్లో ఉపయోగించేవి:

  • పిల్స్ - స్త్రీ ప్రతిరోజూ తీసుకునే మాత్రలు.
  • ఇంజెక్షన్లు - ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్లు.
  • ఇంప్లాంట్లు - వీటిని మహిళ భుజంలోకి చొప్పిస్తారు. ఇవి అనేక సంవత్సరాల పాటు కొనసాగుతాయి.
  • హార్మోన్ల పద్ధతులన్నీ స్త్రీ నియంత్రణలో ఉంటాయి పురుషుడికి తెలియకుండానే స్త్రీ వీటిని ఉపయోగించవచ్చు.

గుర్తుంచుకోండి - హార్మోన్ల పద్ధతులనేవి STIలు లేదా HIV నుండి రక్షించవు.

స్త్రీ అండాశయాల నుండి అండం విడుదల కాకుండా నిరోధించడం ద్వారా హార్మోన్ల పద్ధతులు పనిచేస్తాయి. హార్మోన్‌లనేవి గర్భశయం ప్రవేశద్వారం వద్ద శ్లేష్మాన్ని చాలా మందంగా చేస్తాయి. తద్వారా, వీర్యం గర్భాశయం లోపలకి రాకుండా ఆపడంలో సహాయపడుతాయి.

కుటుంబ నియంత్రణ కోసం తీసుకునే చాలా మాత్రలు మరియు కొన్ని ఇంజెక్షన్లలో ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిన్ రెండూ ఉంటాయి. వీటిని 'కూంబినేషన్' పిల్స్ లేదా ఇంజెక్షన్లు అంటారు. గర్భం రాకుండా అద్భుతమైన రక్షణ అందించడానికి ఈ రెండు హార్మోన్లు కలిసి పనిచేస్తాయి. అయితే, కొంతమంది మహిళల విషయంలో ఆరోగ్య కారణాలు లేదా తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఈస్ట్రోజెన్ మాత్రలు లేదా ఇంజెక్షన్లను ఉపయోగించకూడదు.

ప్రొజెస్టిన్-ఓన్లీ పిల్స్ (మినీ-మాత్రలు అని కూడా పిలుస్తారు), ఇంప్లాంట్లు మరియు కొన్ని ఇంజెక్షన్లలో హార్మోన్-ప్రొజెస్టిన్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్రోజెన్ ఇచ్చే పరిస్థితి లేని లేదా తల్లిపాలు ఇచ్చే మహిళలకు ఈ పద్ధతులనేవి కాంబినేషన్ పిల్స్ లేదా ఇంజెక్షన్ల కంటే సురక్షితమైనవిగా ఉంటాయి.

Sources
  • Audiopedia ID: tel020417