కుటుంబ నియంత్రణ గురించి నేను ఆలోచించాలా

From Audiopedia
Jump to: navigation, search

వైకల్యం కలిగిన చాలామంది బాలికలు సెక్స్ గురించి లేదా కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం లేకుండా పెరుగుతారు. అయినప్పటికీ, వైకల్యాలున్న చాలా మంది మహిళలు-శరీరం క్రింది భాగంలో ఎలాంటి భావన లేనివారు సైతం గర్భం ధరించగలరు. కాబట్టి, సెక్స్ జీవితం సాగించినప్పటికీ, గర్భం ధరించకూడదని మీరు భావిస్తే, మీరు కుటుంబ నియంత్రణ పద్ధతి ఉపయోగించాలి.

మీకు ఏ కుటుంబ నియంత్రణ పద్ధతి ఉత్తమమో నిర్ణయించడానికి ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి: మీకు స్ట్రోక్ ఉంటే లేదా నడవలేని స్థితిలో ఉంటే మరియు మీరు అన్ని సమయాల్లోనూ కూర్చుని లేదా పడుకుని ఉండాల్సిన పరిస్థితిలో ఉంటే, జనన నియంత్రణ మాత్రలు, ఇంజెక్షన్లు లేదా ఇంప్లాంట్లు లాంటి హార్మోన్ పద్ధతులు ఉపయోగించకూడదు. వాటి వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు రావచ్చు.

మీకు శరీరం క్రింది భాగంలో ఎలాంటి అనుభూతి లేకుండా లేదా కడుపులో మాత్రం కొంచెం అనుభూతి ఉంటే, గర్భాశయ లోపల పెట్టే పరికరం (ఐయుడి) ఉపయోగించకూడదు. దాన్ని సరిగ్గా అమర్చకపోతే లేదా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ మీకు సోకే అవకాశం ఉంటే, అది సంక్రమణకు కారణం కావచ్చు. మీకు ఆ భాగంలో అనుభూతి లేదు కాబట్టి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ, ఆ విషయం మీరు చెప్పలేరు.

మీరు మీ చేతులను సరిగ్గా ఉపయోగించలేకపోతే, డయాఫ్రాగమ్, స్త్రీలు ఉపయోగించే కండోమ్ లేదా ఫోమ్ లాంటి పద్ధతులు ఉపయోగించడం మీకు కష్టంగా ఉండవచ్చు. ఆ విషయంలో సహాయం కోసం మీ భాగస్వామిని అడిగే పరిస్థితి ఉంటే, అతను వాటిని మీకు అమర్చగలడు. మీ వైకల్యం కాలక్రమేణా తీవ్రమైతే, మీ వైకల్యం తీవ్రతను బట్టి మీరు మీ కుటుంబ నియంత్రణ పద్ధతి మార్చుకోవాల్సి రావచ్చు.

కండోమ్‌లు గర్భం రాకుండా నిరోధించడమే కాకుండా, ఎస్టీఐలు లేదా హెచ్ఐవీకి గురికాకుండా కూడా అవి మిమ్మల్ని రక్షిస్తాయి.

Sources
  • Audiopedia ID: tel011110