కుటుంబ నియంత్రణ గురించి నేను నా భర్త లేదా భాగస్వామితో ఎలా మాట్లాడగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

కుటుంబ నియంత్రణను ఎంచుకోవడం గురించి మరియు మీరు ఏ పద్ధతి ఉపయోగించాలనుకుంటున్నారనే దాని గురించి మీరు మీ భర్త లేదా భాగస్వామితో కలిసి నిర్ణయించుకోవడం మంచిది.

కొంతమంది పురుషులు తమ భార్యలు కుటుంబ నియంత్రణ ఉపయోగించడం ఇష్టపడరు. ఎందుకంటే, వివిధ పద్ధతులు ఎలా పనిచేస్తాయనే దాని గురించి తరచుగా వాళ్లగా పెద్దగా తెలియదు. అలాగే, ఒక పురుషుడు కుటుంబ నియంత్రణ వల్ల కలిగే ప్రమాదాల గురించిన కథలు విని ఉన్నప్పుడు, అతను తన భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. స్త్రీ కుటుంబ నియంత్రణ ఉపయోగిస్తే, ఆమెకి వేరొక పురుషుడితో సంబంధం ఉందేమోనని అతను భయపడవచ్చు లేదా చాలామంది పిల్లలు ఉండడం 'మగతనానికి ప్రతీక' అని కూడా అతను భావించవచ్చు.

ఈ అధ్యాయంలోని సమాచారాన్ని మీ భాగస్వామితో పంచుకోవడానికి ప్రయత్నించండి. క్రింది విషయాలు అతను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడవచ్చు:

  • కుటుంబ నియంత్రణ వల్ల మిమ్మల్ని మరియు మీ పిల్లలను బాగా చూసుకోవడానికి అతనికి వీలు లభిస్తుంది.
  • పిల్లల మధ్య దూరం మీకు మరియు మీ పిల్లలకు సురక్షితం.
  • అవాంఛిత గర్భం గురించి మీ ఇద్దరిలో ఎవరూ ఆందోళన పడే అవసరం ఉండదు కాబట్టి, కుటుంబ నియంత్రణ వల్ల మీరు మరింత ఆనందంగా అతనితో సెక్స్‌లో పాల్గొనవచ్చు. కాబట్టి, అవాంఛిత గర్భం భయం లేనప్పటికీ, మీరు ఇతర పురుషులకి ఆకర్షితం కారని అతను అర్థం చేసుకుంటాడు.

కుటుంబ నియంత్రణ ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత కూడా, మీరు కుటుంబ నియంత్రణ పాటించడానికి మీ భర్త అంగీకరించకపోతే, ఏదేమైనప్పటికీ, కుటుంబ నియంత్రణ ఉపయోగించాలా, వద్దా అని మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఉపయోగించాలనుకుంటే, మీ భాగస్వామికి తెలియకుండానే ఉపయోగించగల ఒక పద్ధతిని మీరు ఎంచుకోవలాల్సి రావచ్చు.

Sources
  • Audiopedia ID: tel020405