కుటుంబ నియంత్రణ వల్ల ఇతర ప్రయోజనాలేమిటి
From Audiopedia
ప్రాణాలు కాపాడడంతో పాటు, కుటుంబ నియంత్రణ వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయిః
కుటుంబ నియంత్రణ వల్ల అవాంఛిత గర్భం గురించిన భయం ఉండదు కాబట్టి, మీరు మరియు మీ భాగస్వామి సెక్స్‌లో మరింత ఆనందించవచ్చు. కొన్ని పద్ధతుల వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, కండోమ్ మరియు స్పెర్మిసైడ్లు ఉపయోగించడం వల్ల HIVతో సహా సాంక్రమిక ఇన్ఫెక్షన్ల (STIలు) వ్యాప్తి నుండి రక్షణ లభిస్తుంది. హార్మోన్ల పద్ధతి వల్ల స్త్రీ నెలసరి రక్తస్రావం సమయంలో క్రమరహిత రక్తస్రావం మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ అధ్యాయంలో పేర్కొన్న కుటుంబ నియంత్రణ పద్ధతులన్నింటినీ లక్షలాది మంది మహిళలు సురక్షితంగా ఉపయోగిస్తున్నారు. నిజానికి, గర్భం మరియు ప్రసవం కంటే ఈ పద్ధతులు చాలా సురక్షితమైనవి.