కొంతమంది మహిళలు గర్భస్రావం కోరుకోవడానికి కారణమేమిటి
గర్భస్రావం చేయించుకోవాలనే నిర్ణయం ఎల్లప్పుడూ కష్టతరమైనదే. గర్భస్రావం తప్పు అని కొన్ని మతాలు పేర్కొంటాయి. చాలా దేశాల్లో గర్భస్రావం చట్టబద్ధం కాదు లేదా సురక్షితం కాదు. అయినప్పటికీ, గర్భస్రావం చేయించుకోవాలని ఒక మహిళ సిద్ధం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి:
ప్రణాళిక లేని మరియు అవాంఛిత గర్భం అనేది క్రింది సందర్భాల్లో సంభవించవచ్చు... ... గర్భం ఎలా వస్తుందో స్త్రీకి మరియు ఆమె భాగస్వామికి తెలియదు. ... కుటుంబ నియంత్రణ చేయడానికి ఆ మహిళకి తగినంత వయసు లేదని ఆరోగ్య కార్యకర్తలు భావించినప్పుడు. ... బలవంతంగా ఆమెతో లైంగిక చర్య జరిపినప్పుడు. ... కుటుంబ నియంత్రణ అందుబాటులో లేకపోవడం, దానిని సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం లేదా అది విఫలం కావడం.
గుర్తుంచుకోండి: అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్న 3 రోజుల లోపల ఒక మహిళ త్వరగా స్పందించగలిగితే, గర్భం వచ్చే అవకాశాన్ని నిరోధించవచ్చు.