క్యాన్సర్‌ని నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

చాలా క్యాన్సర్లకు ప్రత్యక్ష కారణాలు తెలియవు.

ఆరోగ్యకరమైన జీవనశైలి అనేక క్యాన్సర్లను నిరోధించగలదు. పోషకాహారం తీసుకోడం మరియు క్యాన్సర్‌కి కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండడం అని దీని అర్థం. ఉదాహరణకు:

పొగాకు తాగకండి లేదా నమలకండి. మీ ఇంట్లో లేదా పని ప్రదేశంలో హానికర రసాయనాలు నివారించే ప్రయత్నం చేయండి. అలాగే, రసాయనాలతో పండించిన లేదా భద్రపరచిన ఆహారాలకు దూరంగా ఉండండి.

చాలామంది మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు సర్వసాధారణం. ప్రత్యేకించి, మృదువైన, ద్రవంతో నిండిన (తిత్తులు అని పిలుస్తారు) గడ్డలు వస్తుంటాయి. సాధారణంగా, మహిళల నెలసరి చక్రంలో వీటి తీరు మారుతుంటుంది. కొన్నిసార్లు వీటిని నొక్కినప్పుడు నొప్పి లేదా బాధ ఉంటుంది. అయితే, రొమ్ము గడ్డల్లో కొన్ని క్యాన్సర్ కావచ్చు. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, ప్రతి మహిళ నెలకొకసారి తన రొమ్ముల్లో ఏవైనా గడ్డలు ఉన్నాయా అని పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి.

హెపటైటిస్ బి మరియు సి కారణంగా, కాలేయ క్యాన్సర్ సంభవించవచ్చు. సురక్షిత శృంగారం మరియు సూదులు పంచుకోకుండా ఉండడం ద్వారా హెపటైటిస్ బి మరియు సి నిరోధించవచ్చు. అలాగే, హెపటైటిస్ బి నిరోధం కోసం టీకా కూడా ఉంది. పిల్లలు పుట్టగానే వాళ్లకి ఈ టీకా వేయించవచ్చు. పెద్దవాళ్లు ఎప్పుడైనా ఈ టీకా వేసుకోవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ నుండి యువతను రక్షించడం కోసం 'HPV టీకా' అనే కొత్త టీకా అభివృద్ధి చేయబడింది మరియు అనేక దేశాల్లో వినియోగంలో ఉంది. అమ్మాయిలు శృంగార జీవితం ప్రారంభించడానికి ముందే వాళ్లకి ఈ టీకా వేయించాలి. మీరు నివసించే చోట ఈ టీకా అందుబాటులో ఉందా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి.

గుర్తుంచుకోండి: క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించి, చికిత్స చేస్తే నయం చేయవచ్చు. క్యాన్సర్‌ని ముందుగానే కనుగొనడం వల్ల మహిళ ప్రాణాలు కాపాడవచ్చు. ఎందుకంటే, క్యాన్సర్ వ్యాపించకముందే ఆమెకు ముందస్తు చికిత్స అందించవచ్చు. మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే స్థానిక ఆరోగ్య సేవల కేంద్రాల్లో క్యాన్సర్ పరీక్షల కోసం వెళ్లండి.

Sources
  • Audiopedia ID: tel011403