క్యాన్సర్ గురించిన హానికర నమ్మకాలు ఏవి
From Audiopedia - Accessible Learning for All
అత్యంత అనారోగ్యంగా ఉంటే తప్ప, సాధారణంగా మహిళలు ఆరోగ్య కార్యకర్త లేదా వైద్యుడి వద్దకు వెళ్లరు. కాబట్టి, క్యాన్సర్ సోకిన మహిళలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే లేదా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, వారిలో క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించరు. అలాగే, క్యాన్సర్ బారిన పడిన మహిళలను కొన్నిసార్లు 'శాపగ్రస్తులుగా'గా పరిగణిస్తుంటారు. వారి కుటుంబాలు లేదా సంఘాలు వారిని దూరం పెట్టవచ్చు. తద్వారా, వాళ్లకి ఎదురయ్యే ఒంటరితనం అనేది అనారోగ్యంతో ఉన్న ఆ మహిళలకే కాకుండా, ఆ మొత్తం సమాజానికి కూడా చేటు చేస్తుంది. ఎందుకంటే, క్యాన్సర్ అనేది మనుష్యుల్లో ఎలాంటి అనారోగ్యం కలిగిస్తుందో ప్రతిఒక్కరికీ తెలిసే పరిస్థితి ఉండదు.
గుర్తుంచుకోండి: క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ కాదు. అది 'అంటుకోదు' మరియు ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు.