క్రింద పడడం ద్వారా పిల్లలు గాయాలు చేసుకోవడానికి సర్వసాధారణ కారణాలేమిటి
From Audiopedia
నడవడం, పరుగెత్తడం మరియు దూకడం నేర్చుకునే సమయంలో పిల్లలు తరచుగా పడిపోతుంటారు. పిల్లలు ఇలా పడిపోయినప్పుడు వారికి చిన్నపాటి గాయాలు కావడం మరియు గీసుకుపోవడం సాధారణమే. అయితే, కొన్నిసార్లు ఇలా పడడం వల్ల వాళ్లకి ఎముకలు విరిగిపోతాయి, తలకు లేదా ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.
పసి పిల్లల్ని పట్టించుకోనప్పుడు వాళ్లు బెడ్, మంచం లేదా ఊయల నుండి పడిపోతుంటారు. మెట్లు దిగే సమయంలో లేదా కిటికీలు లేదా బాల్కనీల నుండి కూడా చిన్నపిల్లలు పడిపోవచ్చు.
దేనిమీదకైనా ఎక్కడమంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే, వాళ్లు ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతే లేదా ఆ సమయంలో వాళ్ల మీద భారీ ఫర్నిచర్ పడితే వాళ్లు తీవ్రంగా గాయపడవచ్చు.