క్రింద పడడం వల్ల నా పిల్లలకి గాయాలు కాకుండా నేనెలా నిరోధించగలను

From Audiopedia
Jump to: navigation, search

పిల్లల్ని గమనిస్తూ ఉండడంతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా, పిల్లలు పడినప్పటికీ, తీవ్రమైన గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు:

  • సురక్షితం కాని ప్రదేశాల మీదకు ఎక్కకుండా పిల్లల్ని నిరుత్సాహపరచండి మరియు నిరోధించండి
  • మెట్లు మరియు బాల్కనీల్లో ఆడుకోవడానికి పిల్లల్ని అనుమతించకండి. వాళ్లు ఆ ప్రదేశాల్లో ఆడుతుంటే, వాళ్లని గమనిస్తూ ఉండండి
  • మెట్లు, కిటికీలు లేదా బాల్కనీలకు తగిన వెడల్పు మరియు ఎత్తుతో ఉండే నిలువు బార్లతో రెయిలింగ్ నిర్మించండి
  • ఇంటిని శుభ్రంగా ఉంచండి, చక్కగా కాంతి ఉండేలా చూడండి. పదునైన వస్తువులు మరియు మొనదేలిన అంచులతో ఉండే వస్తువులు పిల్లలకి చిక్కకుండా ఉంచండి
  • ఎత్తైన కుర్చీల్లో కూర్చోబెట్టినప్పుడు పిల్లలు పడిపోకుండా జాగ్రత్త చేయండి
  • పసిపిల్లలు బెడ్లు, మంచాలు, హామోక్స్ లేదా వాకర్లు లేదా శిశు ఉపకరణాల్లో ఉన్నప్పుడు వాళ్లని వదలి వెళ్లకండి
  • బెడ్లు, కుర్చీలు మరియు ఊయల తొట్లు లాంటి ఫర్నీచర్లను కిటికీల నుండి దూరంగా ఉంచండి
  • బొమ్మలు లేదా పిల్లలకు నచ్చే వస్తువులు ఎత్తైన షెల్పుల్లో ఉంచకండి. అవి పిల్లల్ని ఆకర్షించినప్పుడు, వాటిని అందుకోవడం కోసం వాళ్లు క్యాబినెట్లు లేదా షెల్పులు లాంటి వాటి మీదకు ఎక్కే ప్రమాదం ఉంది.
Sources
  • Audiopedia ID: tel020611